టాలీవుడ్ మెగస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘గాడ్‌ఫాదర్’లో చేయనున్న సంగతి తెలిసిందే. షూట్ ఎప్పుడు జరుగుతుందనే అప్‌డేట్ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. కానీ దీనికి సంబంధించిన ఓన్యూస్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సల్మాన్ ఖాన్ కు సంబంధించి సీన్లను చిత్రీకరించనున్నారట.

దీనిలో సల్మాన్ ఖాన్ జాయిన్ అవుతారనే సమాచారం. ఈ మళయాల చిత్రం లూసీఫర్ లో పృథ్వీరాజ్ చేసిన కీలక పాత్రను తెలుగులో సల్మాన్ చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ముంబైలో ‘RRR’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన బాలీవుడ్ స్టార్, మెగాస్టార్ సినిమా కోసం ఇప్పటికే దీనికి సంబంధించి డేట్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఆహార పొట్లాలను అడ్డు పెట్టుకొని..ప్రముఖ నటిని వేధించిన యువకుడు..!
మోహన్ రాజా దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ (మలయాళం)కి రీమేక్ ‘గాడ్ ఫాదర్’. 2022లో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి , రెండవ షెడ్యూల్స్ వరుసగా హైదరాబాద్, ఊటీలలో జరిగాయి. చిరుతో తదుపరి షెడ్యూల్ జనవరిలో ప్రారంభమవుతుంది.

నీరవ్ షా దీనికి సినిమాటోగ్రాఫర్. సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. చిరంజీవి-రామ్ చరణ్ ల ‘ఆచార్య’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక విక్టరీ వెంకటేష్ సినిమాలో కూడా ఆ సల్లు భాయ్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.





























