కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా బాలీవుడ్ లో సినీ కార్మికులు పడుతున్న కష్టాలను చుసిన సల్మాన్ ఖాన్ తన కు చేతనైన సహాయం చేస్తానని ఇదివరకే ప్రకటించాడు. ఇప్పుడు అన్న మాట నిలబెట్టుకున్నాడు. తాను అన్నట్టుగానే 25 వేల మంది సినీ కార్మికుల ఖాతాల్లోకి రూ.3000 జమచేశాడు. ఈ విషయాన్నీ ది ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియాన్ సినీ ఎంప్లాయిస్ యూనియన్ గురువారం వెల్లడించింది. అలాగే రాబోయే రోజులో రెండు మూడు విడతలు మరోసారి ఆర్ధిక సాయం చేయనున్నట్టు తెలిపారు.

మరో వైపు యశ్ రాజ్ ఫిల్మ్ సంస్థ సుమారు 3000 వేల మంది సినీ కార్మికుల ఖాతాల్లోకి రూ.5000 జమ చేసినట్టు ప్రకటించింది. అంతేకాదు బాలీవుడ్ ప్రముఖులు బోన్ కపూర్, అర్జున్ కపూర్, రోహిత్ శెట్టిలు ఫిలిం ఫెడరేషన్ కు తమ వంతు విరాళాలు అందించారు. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ గిల్టీ అఫ్ ఇండియా 1.5 కోట్ల విరాళాన్ని అందించింది. విరాళాల రూపంలో వచ్చిన నగదుతో సినీ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షలు తివారి.




























