నాగ చైతన్య, సమంతలు తప్ప అక్కినేని కుటుంబం అంతా కలిసే ఉంటారు.. వీరిద్దరూ మాత్రం వేరే ఇంటిలో ఉంటారు. అయితే వారంలో ఒకరోజు ఆదివారం అందరు కలుస్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంతో వీరు కలవడం కుదరటం లేదు కానీ. వారిని ఒకరోజు మాత్రం ఖచ్చితంగా కలుస్తుంటారు అని అక్కినేని వారు చెబుతున్న మాట. అయితే ఎప్పటి నుంచో అక్కినేని కుటుంబం మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అని వార్తలు ఫిలింనగర్ లో వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య, సమంతలు ఇద్దరు అక్కినేని కుటుంబంతో అంటిముట్టనెట్టే ఉంటారని టాక్. దీనికి ఆజ్యం పోసేలా మొన్న అఖిల్ పుట్టినరోజునాడు చై, సమంతలు అఖిల్ కు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ కూడా చెప్పలేదనేది మరో వాదన.

అయితే ఈ మధ్యే ఒక ఇంటర్వ్యూ లో అమల మాట్లాడుతూ “మా కోడలుకు వంట రాదు… కొడుకు చైతూ మాత్రం చక్కగా వంట చేసి పెడతాడు…” అంటూ చెప్పుకొచ్చింది. అయినా మా ఇంట్లో నాగార్జున బాగా వంట చేస్తారని… అలాంటపుడు ఇంకొకరు వంట చేయాల్సిన అవసరం ఏముంది అని అన్నారు. ఇంకా చెప్పాలంటే అక్కినేని కుటుంబంలో ఆడవారు అసలు కిచెన్ వైపు కూడా చూడరు అంటూ సెటైర్స్ వేసింది. దీనితో సమంత అభిమానులు “నువ్వు వంట ఎందుకు నేర్చుకోలేదు..” అని ప్రశ్నిస్తున్నారట. ఈ నేపథ్యంలో అత్తగారి మాటలను సీరియస్ గా తీసుకుందో ఏమో సమంత ఇప్పుడు వంట చేసి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. మష్రూమ్ పాస్తా ను రెడీ చేసి తానూ వంట చేయగలను అనేట్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసింది అక్కినేని వారి కోడలు. చాలా రోజుల తరువాత సోషల్ మొహం చుసిన సమంత వస్తూ వస్తూనే అత్తపై కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here