Samantha : సమంత కెరీర్ లో డౌన్స్ అంటూ ఎక్కువగా చూడని ఈ అమ్మడు మొదటి సినిమా ఏ మాయ చేసావే నుండి అందరిని తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో మాయ చేసింది. తన అందంతో కుర్రకారుని ఫిదా చేసింది. ఇక బృందావనం, సినిమాతో గ్లామర్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సామ్ చాలా తక్కువ సమయంలోనే లక్కీ గర్ల్ గా మారిపోయింది. ఇక సామ్ వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

ఇక తన మొదటి సినిమా ఏ మాయ చేసావే సినిమాతో నాగచైతన్యతో ఏర్పడిన పరిచయం ఆ తరువాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక తన భర్తతో కలిసి మజిలీ సినిమా చేసి మళ్ళీ సక్సెస్ కొట్టింది. ఇక కారణాలు తెలియక పోయినా సమంత నాగచైతన్య వీడిపోయారు. ఆ తరువాత సమంత కెరీర్ ముగిసిపోతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు పడి లేచిన కెరటంలా మరింత దూసుకుపోతోంది.

మాయచేసిన సామ్….

ఇక సామ్ విడాకుల తరువాత మళ్ళీ క్రేజీ ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. అటు పుష్ప లో ఊ అంటావా పాటతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించిన సామ్ తన తదుపరి ప్రాజెక్ట్స్ యశోద, శాకుంతలం కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సామ్ కుర్రహీరోయిన్లకు పోటీగా సినిమాలు చేస్తోంది. ఇక ఇపుడు సమంత ఇండియాలోనే మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా నిలిచింది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు.

ఓర్మాక్స్ మీడియా సంస్థ చేసిన తాజా సర్వే లో సమంత పేరు దేశం మొత్తం మార్మోగిపోతుందని తెలిసింది. ఓర్మాక్స్ సర్వేలో భారతదేశంలో హీరోయిన్స్ జాబితాలో సమంత అగ్రస్థానంలో నిలిచింది. బాలీవుడ్ లో బాగా క్రేజ్ ఉన్న అలియా భట్ రెండో స్థానంలో నిలిచింది. ఆలియా తర్వాత నయనతార, కాజల్ అగర్వాల్, దీపికా పడుకొనే, రష్మిక మందన, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, కీర్తి సురేష్ మరియు పూజా హెగ్డే ఉన్నారు. హీరోలలో తలపతి విజయ్ మొదటి స్థానంలో ఉంటే జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.



































