Samantha : సౌత్ లో బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్ సమంత. మొదటి సినిమా నుండి ఇప్పటివరకు సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా ఫలితం తో సంబంధం లేకుండా హీరోయిన్ గా టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇక అందరు టాప్ హీరోస్ తో సినిమాలు చేసిన సమంత తన మొదటి సినిమా ఏ మాయ చేసావే లో కలిసి నటించిన నాగ చైతన్యను ప్రేమించి అక్కినేని వారింటి కోడలు అయింది. ఇక ఆ తరువాత కూడా సినిమాలను చేస్తూ ఉన్నా ముందులా కాకుండా కేవలం కథలో తన పాత్ర కీలకంగా ఉండే పాత్రలనే చేస్తూ వచ్చింది. ప్రేమించిడానికి కారణాలక్కర్లేదని విడిపోడానికి కారణాలు చెప్పక్కర్లేదన్నట్లు ఈ జంట విడిపోయారు.

కాఫీ విత్ కరణ్ లో విడాకుల గురించి చెప్పిన సామ్….
ఇక విడిపోయాక కొన్నాళ్ళు కెరీర్ లో స్లో అవుతుందనుకున్నా అందరికి షాక్ ఇస్తూ మరింత జోష్ తో సినిమాలను చేస్తోంది సామ్. ఇక పుష్ప లో చేసిన ఐటమ్ సాంగ్ తో ఇండియా మొత్తం పాపులర్ అయింది. ఇక పాన్ ఇండియా సినిమాలైన శాకుంతలం, యశోద వంటి సినిమాలు చేస్తూ మరో వైపు కుర్ర హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలోనూ నటిస్తోంది. ఇక ఈ అమ్మడు బాలీవుడ్ హీరోతో కలిసి వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇక ఈ సీజన్ కాఫీ విత్ కరణ్ షోలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ సందడి చేయనున్నారు. ఇక ఈ షోలో ఇపుడు సమంత కూడా పాల్గొన్నారని షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం.

అయితే ఈ షోలో ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సమంత, నాగచైతన్య విడాకుల గురించి అడిగినట్లు సమాచారం. ఇక సమంత కూడా ఇన్ని రోజులు ఏం మాట్లాడకపోయినా ఇపుడు మాత్రం కారణం షోలో అక్కినేని ఫ్యామిలీ వల్ల ఎంత ఇబ్బంది పడ్డది, ఎందుకు విడాకులు తీసుకున్నది చెప్పి బాంబు పేల్చిందని వినిపిస్తోంది. అయితే షో టెలిక్యాస్ట్ అయితే గాని ఇందులో నిజమెంతో తెలియదు. షో ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.



























