Samantha : సమంత సినిమాల్లో ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. డబ్బులు కోసం మోడలింగ్ చేసి ఆ తరువాత హీరోయిన్ గా టాప్ రేంజ్ కి దూసుకెళ్ళింది. సౌత్ లోని అన్ని భాషల్లోను నటించిన సామ్ టాప్ హీరోస్ అందరి సరసన ఆడి పాడింది. అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెట్టి జీవితంలో సెటిల్ అయింది. ఇక సామ్ నాగచైతన్య తమ మొదటి సినిమాతోనే కనెక్ట్ అయ్యారు. ఆ తరువాత ప్రేమ పెళ్ళికి దారితీసింది. అయితే కారణాలు చెప్పకుండానే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఇద్దరినీ ఈ పరిస్థితుల్లో ఒకే గదిలో ఉంచితే జరిగేది అదే…
విడాకుల తరువాత డీలా పడకుండా సామ్, చైతూ ఇద్దరూ కూడా సినిమాల జోరు పెంచారు. సమంత పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోకి ఎంటర్ అవుతోంది. ఇక సామ్ బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉండటం, అక్కడ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో పాల్గొనింది. ఈ సీజన్ లో ఎక్కువగా దక్షిణాది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ కి పిలుస్తున్న కరణ్ సమంత ను ఇంటర్వ్యూ చేసారు. అందులో విడాకులకు సంబంధించిన ప్రశ్నలు సామ్ ని అడగడం, విడాకులు తీసుకున్నాక మొదటి సారి వాటి గురించి స్పందించడం తో షో ఆసక్తికరంగా ఉండనుంది.

చైతన్య తో ఇప్పటికీ స్నేహపూర్వకంగా ఉన్నారా అని కరణ్ జోహార్ అడిగితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే చేతిలో పదునైన వస్తువులు లేకుండా చూడాలి అంటూ సమాధానం చెప్పి, ఇప్పుడైతే అదే పరిస్థితి ఇక భవిష్యత్తులో స్నేహపూర్వకంగా ఉంటామేమో చూడాలి అంటూ జవాబు చెప్పింది సామ్. ఈ కామెంట్స్ కి సామ్ అభిమానులు మాత్రమే కాదు సగటు ఆడియన్స్ కూడా చైతు మీద సామ్ కి ఎందుకు అంత కోపం అంటూ చర్చించుకుంటున్నారు.



























