Samantha : సమంత, నాగ చైతన్య ఈ జంట విడిపోయినప్పటి నుండి నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నారు. వీరికి సంబంధించిన ఏ విషయమైన సోషల్ మీడియాలో బాగా నానుతుంటుంది. నాలుగేళ్ళ వీళ్ళ వివాహ బంధానికి గత ఏడాది వీళ్ళు విడాకులతో ముగింపు పలికారు. ఇక అప్పటి నుండి సామ్ ను చైతూ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, సామ్ ఫ్యాన్స్ చైతు ని ట్రోల్ చేయడం జరుగుతోంది. సమంత, నాగచైతన్య వాళ్ళ జీవితాల్లో బిజీగా ఉన్నారు. సినిమా ప్రాజెక్ట్స్, మరో వైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.

అలాంటిదాని కోసం మావాడు దేవదాస్ లాగా వెయిట్ చేయాలా….
ఇక తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళతో డేటింగ్ లో ఉన్నాడంటూ హిందీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాగచైతన్య శోభిత హైదరాబాద్ మేజర్ షూటింగ్ కోసం వచ్చినపుడు హోటల్ కి పలుమార్లు వెళ్లినట్లు, అలాగే నాగ చైతన్య కొత్త ఇంటికి శోభిత కూడా కొన్నిసార్లు వెళ్లిందని అలా వీళ్ళు మీడియాలో కంట పడ్డారని కథనాలు వస్తున్నాయి. ఇక ఈ విషయంలో సామ్ పిఆర్ టీం చైతూ మీద రూమర్స్ ప్రచారం చేయిస్తున్నారంటు నిన్న సోషల్ మీడియాలో సమంత ను ట్రోల్ చేసారు. దీనికి సామ్ ఇలా పోస్ట్ పెట్టింది… అమ్మాయి పై రూమర్ వస్తే అమ్మాయిదే తప్పు అదే అబ్బాయి పై రూమర్ వస్తే అమ్మాయి చేయించింది అంటున్నారు మీరు మారరా.

These Guys Just Got jealous Of Her Self Made Stardom !!
— Krithick (@KrithickSammu) June 21, 2022
Just Shameless Guys !!
And Importantly She Never Needs A PR Team To Defend You Guys !! We Are Always Here For Her !
She is Just A Self-Made Queen ~#SamanthaRuthPrabhu https://t.co/6i39XC7jes
ఇక మరో నెటిజెన్ సమంత ను చాలా అసభ్యకరంగా ట్వీట్ చేసాడు. సమంత ఒక వేశ్య, బట్టలు విప్పి బజారులో తిరగమని చెప్పు, ఈ ఐటెం దాని కోసం మా వాడు దేవదాసులా ఉండాలా..?” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పై సమంత స్పందిస్తూ, “నిజంగా భయపడాలి” అని అంటూ రెండు స్మైల్ ఎమోజీలను జోడించింది. వెటకారంగా భయపడినట్లు పోస్ట్ పెట్టింది సామ్. అయితే ఆ వెంటనే ఈ ట్వీట్ ను సదరు నెటిజెన్ తొలగించడం విశేషం. అయితే అతని పై చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.
































