Samantha : సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది సమంత. తెలుగులోనే కాకుండా తమిళ్, బాలీవుడ్ లలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా వుంది. అయితే ఏం మాయ చేసావేలో నాగ చైతన్య, సమంత కలసి నటించారు. తరువాత వీరిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహంతో ఒక్కటైయ్యారు. కానీ తరువాత నాలుగేళ్ళకే విడాకులు తీసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. విడాకుల తరువాత ఎవరి కెరీర్ లో వాళ్ళు సక్సెస్ తో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా సమంతకు సంబందించిన ఒక ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది.

మామను రీప్లేస్ చేస్తున్న సమంత…
బిగ్ బాస్ రియాలిటీ షోకు గత మూడు సీజన్స్‌కు నాగార్జున హోస్ట్ గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెక్స్ట్ సీజన్‌కు నాగార్జున హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ టీమ్ హోస్ట్ గా సమంతను అనుకుంటున్నట్టు సమాచారం. త్వరలోనే నెక్స్ట్ సీజన్ మొదలుకానుంది. అయితే ఈ సీజన్‌కు సమంత హోస్ట్ గా చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఇది నిజమే అన్న వార్తలు వస్తున్నాయి. కాకపోతే నాగ చైతన్యతో విడాకుల తర్వాత నాగార్జున హోస్ట్ గా చేసిన ప్రోగ్రాం ఇపుడు సమంత చేయబయితుంది అనడంతో అంతటా ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తోంది. ఇక ఈ విషయం గురించి త్వరలో అధికారిక ప్రకటనకూడా రాబోతోంది అంటున్నారు.

































