తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత ఆ తర్వాత తమిళం ఇండస్ట్రీలోను అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లి తెర పై, పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు. తాజాగా సమంత “ది ఫ్యామిలీ మెన్ 2″అని వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రస్తుతం సమంత ”శాకుంతలం” అనే సినిమాలో నటిస్తుంది. దీనిని పాన్ ఇండియా లెవల్ లో రూపొందిస్తున్నారు దర్శకుడు గుణశేఖర్.. అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే సమంత ప్రతిరోజూ ఆమె ఫోటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు.

ఈ నేపధ్యంలో కొద్దిర్ రోజుల క్రితం తన సోషల్ మీడియా అకౌంట్ల లో ఆమె పేరు సమంత అక్కినేని తొలగించి కేవలం “ఎస్” అనే అక్షరం పెట్టడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతుంది. ఈ నేపద్యంలో సమంతా, నాగ చైతన్య ల మధ్య విభేదాలు వచ్చాయని, వీరిద్దరూ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన ఈ వార్తలపై అటు సమంత కానీ, చైతన్య కానీ స్పందించలేదు. ఈ క్రమంలో ఆదివారం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా సమంత చేసిన ట్వీట్‌తో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ వచ్చిన వార్తలు ఒట్టి పుకార్లె నని చెప్పకనే చెప్పారు సమంత.

అయితే తాజాగా ఆగస్ట్ 29న నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా సమంత విష్ చేసింది. ఇది చూసిన తర్వాత అక్కినేని అభిమానులు కాస్త కుదుట పడ్డారు. ”మీ పట్ల నా గౌరవాన్ని వ్యక్తం చేయటానికి ఎటువంటి మాటలు సరిపోవు మామ” అంటూ సమంత ట్వీట్ చేశారు.
No words can describe my respect for you. I wish you an abundance of health and happiness, today and always.Happy birthday to the man ,the phenomena @iamnagarjuna mama????☺️♥️
— S (@Samanthaprabhu2) August 29, 2021
ఇది చూసిన తర్వాత అక్కినేని అభిమానులు హమ్మయ్యా.. సమంతా, నాగచైతన్య ల మధ్య ఎటువంటి విభేదాలు లేవు.. బాగానే ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలన్నీ ఉట్టి ప్రచారమే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఈ విషయంపై సమంత, చైతూ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించి వస్తున్న వార్తలకి పూర్తిగా చెక్ పడుతుందని వాళ్లు భావిస్తున్నారు.































