టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో సమంత ప్రత్యేకమని చెప్పాలి. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి పది సంవత్సరాలైనా నేటికీ సామ్ హవా కొనసాగుతూనే ఉంది. అటు గ్లామర్ పాత్రల్లో నటించినా ఇటు అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించినా సామ్ ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తూ తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. పెళ్లికి ముందు ఎక్కువగా గ్లామర్ రోల్స్ పోషించిన సమంత పెళ్లి తరువాత అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తోంది.

ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో శర్వానంద్, సమంత కాంబినేషన్లో తెరకెక్కిన జాను సినిమా విడుదలై యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. తాజాగా సామ్ ఒక ప్రైవేట్ యాప్ ను లాంఛ్ చేసింది. ఈ యాప్ విడుదల సందర్భంగా సామ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ లో ఫేక్ కాల్స్, రాంగ్ మెసేజ్ ల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని సమంత ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలన్నా, షాపింగ్ చేయాల్సి వచ్చినా మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని… మొబైల్ నంబర్ ఇవ్వడం తనకు పెద్ద తలనొప్పిగా మారిందని ఆమె అన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో పాల్గొన్న సామ్ దూస్రా యాప్ ద్వారా మన నంబర్ ఇతరులకు తెలిసే అవకాశం ఉండదని చెప్పింది. ఆన్ లైన్ లో ఒక ప్రాడక్ట్ ఆర్డర్ చేస్తే ఇతరులకు నంబర్ ఎలా వెళుతుందో అర్థం కావడం లేదని సామ్ అన్నారు.

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసిన సమయంలో కొంతమంది నిజంగా సమంతనేనా…? అని కాల్స్ చేస్తుంటారని కొన్ని సందర్భాల్లో ఆ కాల్స్ వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుందని సామ్ పేర్కొన్నారు. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల కాల్స్ మాత్రమే లిఫ్ట్ చేస్తానని వారి సందేశాలకు మాత్రమే రిప్లై ఇస్తానని సామ్ చెప్పారు. మీడియా ప్రతినిధులు డ్రగ్స్ వివాదం గురించి సామ్ ను ప్రశ్నించగా నో కామెంట్స్ అని సమాధానమిచ్చారు.



























