టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నటి నుంచి సమంత, నాగచైతన్యల పేర్లు బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుండి వీరి మధ్య విభేదాలు వచ్చాయని త్వరలోనే ఈ జంట విడిపోతున్నారని బాగా వార్తలు వినిపించాయి. కానీ ఇవన్నీ పుకార్లే అని ఎందరో అభిమానులు అనుకున్నారు. కానీ నిన్నటితో నిజంగానే వీళ్ళు విడిపోతున్నారని క్లారిటీ వచ్చేసింది.
ఏం మాయ చేసావే సినిమాలో తొలిసారిగా ఇద్దరూ జంటగా నటించగా.. ఈ సినిమాతోనే తమ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరి జీవితం ఎంతో అన్యోన్యంగా సాగింది. కానీ అంతలోనే పెళ్లి బ్రేకప్ వార్తతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచారు. దీంతో అక్కినేని కుటుంబంతో సహా అభిమానులంతా షాక్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా వీరి మధ్య మరో అగ్రిమెంట్ ఉందని తెలుస్తుంది.
పెళ్లికి ముందు ఇరు కుటుంబాలు ఫ్రీ మ్యారిటల్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే వైవాహిక జీవితంలో ఏదైనా తేడా వచ్చి విడిపోయినప్పుడు భరణం చెల్లించాల్సిన విషయంలో ఎటువంటి గొడవలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఇటువంటి అగ్రిమెంట్ చేయించుకుంటారు. అయితే సమంత, నాగచైతన్య మధ్యలో కూడా ఇటువంటి అగ్రిమెంట్ ఉందని టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ వారి మధ్య అగ్రిమెంట్ ఉన్నట్లయితే సమంతకు భరణం చెల్లించకూడదు. కానీ అక్కినేని కుటుంబం సమంతాకు రూ.200 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. మరి సమంత ఈ భరణం తీసుకుంటుందో లేదో అనేది హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…