Samantha: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేస్తున్న ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచడమే కాకుండా సామ్ ఖాతాలో మరో హిట్ గ్యారెంటీ అంటూ అభిమానులు విశ్లేషకులు ఈ సినిమా ట్రైలర్ పై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి ఇందులో సమంత ధరించిన నగలు చీర గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాలో సమంత శకుంతల పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో ఈమె పాత్రకు గాను ప్రత్యేకమైన నగలు చీరలను డిజైన్ చేశారు. ఈ క్రమంలోనే సమంత శాకుంతలం సినిమాకు గాను ధరించిన నగలను ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కి చెందిన వసుంధర డైమండ్స్ రూఫ్ వారు ఈ నగలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. వీటి కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో సమంత ధరించిన ఓ చీర ఏకంగా 30 కిలోల బరువు ఉందని, ఈ చీరతో సమంత ఏడు రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నారనీ ఈ సినిమాకు స్టైలిష్‌గా వర్క్ చేసిన ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా తెలియజేశారు ఈ సినిమా కోసం సమంత ధరించిన నగలు చీర గురించి ఈ విషయాలు తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. యశోద వంటి మంచి హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న సమంత ఈ సినిమా ద్వారా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…