సోషల్ మీడియాలో ఎప్పుడు ఫుల్ యాక్టివ్ గా ఉండే సమంత అక్కినేని ఎప్పటికప్పుడు అభిమానులతో విశేషాలు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రానా దగ్గుబాటి రోకా ఫంక్షన్ కు హాజరైన చైతు సమంత దంపతులు. కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ వేడుకలో చాలా సంప్రదాయ దుస్తులలో కనిపించిన సమంత. నాగ చైతన్య కూడా స్టైలిష్ లుక్ లో కనిపించాడు.

ఈ సందర్భంగా తీసిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది సమంత. అదే సమయంలో రానా, మిహికా దంపతులతో నేటితరం దగ్గుబాటి ఫ్యామిలీతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. కాగా, చైతన్య లుక్ పై కామెంట్ చేసింది. “అమ్మ, ఆంటీ, బంధువులు, స్నేహితులు అందరిని పంపించిన తరువాత ఇప్పుడే ఇంస్టాగ్రామ్ కు టైం దొరికింది. నా భర్తని చుడండి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో కదా.. ఎక్కడ గోతులు తవ్వుతున్నాడో…” అంటూ పోస్ట్ చేసింది.

వెంటనే నాగ చైతన్య కూడా ఈ పోస్టుపై ఫన్నీగా స్పందించాడు. “ఇది ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్ పోస్టులలో ఒకటిగా కనిపిస్తుంది.” అంటూ రిప్లై ఇచ్చాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here