గత మూడు వారాల క్రితం తాము ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నామని సమంత, నాగచైతన్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం వాళ్లు చెప్పలేదు. ఆ రోజు నుంచి సోషల్ మీడియాలో వాళ్లిద్దరి మధ్య పుకార్లు వస్తూనే ఉన్నాయి.

ఇప్పటికీ వాటిపై క్లారిటీ మాత్రం రాలేదు. ఇక విడాకుల తర్వాత వాళ్లిద్దరు తన కెరీర్‌పై ఫోకస్ పెట్టారు. మీడియాలో ఇక పుకార్లు తగ్గించాలని.. తన పని తాను చూసుకుంటున్నట్లు సమంత స్పందించిన విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి తప్పించుకోడానికి ఆమె బిజీ షెడ్యూల్ లో మునిగి తేలుతున్నారు. ఖాళీ సమయంలో జిమ్ లో గడుపుతున్నారు.
అంతక ముందు తక్కువ షెడ్యూల్ ను ఏర్పరచుకున్న సమంత.. ఏ మాత్రం ఖాళీ సమయంలో లేకుండా.. ఆమె బిజీ అయిపోయారు. ప్రస్తుతం శాకుంతలం సినిమా చివరి దశలో ఉండగా.. మరో సినిమా విజయ్ సేతుపతితో తమిళంలో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’లో నటిస్తోంది. ఇదే కాకుండా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించే ప్రయత్నంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో కూడా నటించేందుకు సమంత ఓకె చెప్పేశారట.
బాలీవుడ్ లో మరో సినిమాలో షారుక్ ఖాన్ సరసన నటించేందుకు సమంతను ఫైనల్ చేశారట. దీనికి ఆమెకు దాదాపు రూ. 7 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట. ఇలా ఆమె విడాకుల తర్వాత సినిమా కెరీర్ ఊపందుకునే చెప్పాలి.































