Samantha: సినీనటి సమంత ప్రస్తుతం హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు ఈ వెబ్ సిరీస్ నవంబర్ 6వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోల ప్రసారం అవుతుంది. ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ కి భారీ స్థాయిలో ప్రమోషన్లను ఇప్పటికే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే సమంత నటుడు వరుణ్ ధావన్ తో కలిసి ఒక చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ స్పైసీ రాపిడ్ ఫైర్ సెషన్ లో భాగంగా ఎదుట వ్యక్తి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ సమాధానాలు చెప్పని పక్షంలో ఒక పచ్చిమిర్చి తినాల్సి ఉంటుంది. ఇక ఈ సెషన్ లో భాగంగా సమంతను ప్రశ్నిస్తూ మీరు అవసరం లేకపోయినా వేటి కోసం అధికంగా డబ్బు ఖర్చు చేశారు అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు సమంత ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. నేను అవసరం లేకపోయినా నా మాజీ కోసం గిఫ్టులు ఇవ్వటానికి ఖర్చు చేశాను అంటూ పరోక్షంగా నాగచైతన్య గురించి ఈమె ఇక్కడ ప్రశ్నించారు. ఎంత ఖర్చు చేశారు అంటూ మరోసారి వరుణ్ ధావన్ ప్రశ్నించగా చాలా ఎక్కువగానే ఖర్చు చేశాను ఇక కొనసాగిద్దాం అంటూ మరో ప్రశ్న అడగమని చెప్పారు..

Samantha: మాజీ భర్త..
ఈ విధంగా సమంత నాగచైతన్య కోసం అవసరం లేకపోయినా ఎన్నో కానుకలు ఇచ్చానని వాటికోసం డబ్బులు కూడా పెద్ద ఎత్తున ఖర్చు చేశానని చెప్పడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. ఇక మరో ప్రశ్న వేస్తే మీరు చివరిగా ఎవరికి మెసేజ్ చేశారో ఆ మెసేజ్ చదివి వినిపించాలని చెప్పడంతో సమంత అందుకు ఒప్పుకోలేదు అందుకే ఒక పచ్చిమిర్చి తిన్నారు..




























