Samantha – Sreeshanth: టాలీవుడ్ లో ఎంతో రొమాంటిక్ కపుల్ గా పేరుపొందిన జంట సమంత, అక్కినేని నాగచైతన్య. అనూహ్యంగా గత సంవత్సరం విడాకుల ప్రకటనతో ఇద్దరు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా వారిద్దరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు.
విడాకులు ఎందుకు తీసుకున్నారో కారణం తెలియకపోవడంతో.. వివిధ రకాలు వార్తలు వైరల్ గా మారాయి. అయితే వారిద్దరు మాత్రం వాటిని లెక్క చేయకుండా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఇప్పటికే నాగచైతన్యకు సంబంధించి లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలు థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. సమంత హీరోయిన్ గా సినిమాలో విడుదల కాకపోయినా.. నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ.. అభిమానులకు దగ్గరవుతూ ఉన్నారు.
ఇక ఇటీవల బన్నీ సినిమా పుష్పలో ఐటెం సాంగ్ లో మెరిసిని సమంతో ఓ ఊపు ఊపేశారు. ఇదంతా ఇలా ఉండగా.. సమంత చేతిలో ఇప్పటికే అర డజను సినిమాలు ఉన్నాయి. అందులో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, విజయ్ సేతుపతి , సమంతల రాబోయే తమిళ చిత్రం కాతు వాకులా రెండు కాదల్.
దీనిలో క్రికెటర్ శ్రీశాంత్ కూడా నటిస్తున్నట్లు చిత్రం మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు అతడి ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. కాతు వాకుల రెండు కాదల్‌లో శ్రీశాంత్ మహమ్మద్ మోబి పాత్రలో నటిస్తున్నాడు. అతను పోస్టర్‌లో సూట్‌లో కనిపిస్తున్నాడు. అతని పాత్ర గురించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. రాబోయే రోజుల్లో, ఈ చిత్రం నుండి మరింత మంది నటీనటులను పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి సమంత, నయనతార, విజయ్ సేతుపతిల లుక్ విడుదల కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక శ్రీశాంత్ విషయానికి వస్తే ఇతడు అంతక ముందే ఓ సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ అతడికి ఆ సినిమా మంచి గుర్తింపును తీసుకురాలేదు. అయితే ఈ సినిమాతో అయినా.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని అతడు ఆశిస్తున్నాడు. అంతే కాదు.. శ్రీశాంత్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…