Samantha: సమంత విడిపోయి దాదాపు ఏడాది కావస్తోంది. ఇలా వీరు విడిపోయినప్పటికీ వీరి గురించి ఏ విషయం తెలిసిన హాట్ టాపిక్ గా మారుతోంది. ఇలా వీరిద్దరూ విడిపోయి వీరి సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు కానీ ఇప్పటికి వీరి విడాకులకు సరైన కారణాలు మాత్రం తెలియడం లేదు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
ఇలా ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలియక వీరి విడాకులకు కారణం ఇదేనంటూ ఎన్నో వార్తలు సృష్టించారు. ఇలాఎంతగానో ప్రేమించిన వ్యక్తి నుంచి దూరం అయ్యేసరికి సమంత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని తెలుస్తోంది. విడాకుల ప్రకటన వెలువడగానే సమంత తనలో ఉన్న బాధను సోషల్ మీడియా వేదికగా పోస్టుల రూపంలో తెలియజేశారు.
ఇలా సమంత చైతన్య నుంచి విడిపోయినప్పుడు ఎంతో కృంగిపోయిందని, ఆ సమయంలో జీవితం ఎంతో కష్టంగా మారిందని తాజాగా ఒక టాక్ షోలో ఈమె వెల్లడించారు.అయితే ప్రస్తుతం అంతా సెట్ అయిందని చెప్పినప్పటికీ తనని ఇంకా చైతన్య జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయని తెలుస్తోంది.
తాజాగా సమంత ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు.ఇలా ముంబై ఎయిర్ పోర్టులో ఈమె కనపడగానే ఒక్కసారి కెమెరాలన్ని క్లిక్ మనిపించాయి. ఇక ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన సమంత చేతిలో మాత్రం లూయిస్ హే రాసిన ‘యూ కెన్ హీల్ యువర్ లైఫ్’అనే బుక్ తన చేతిలో కనిపించింది.ఇలా ఈ బుక్ కనిపించడంతో సమంతను ఇంకా చైతన్య జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని వాటి నుంచి బయటపడటం కోసమే ఈమె ఇలాంటి పుస్తకాలు చదువుతుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…
మెగాస్టార్ చిరంజీవికి భుజం సర్జరీ ఆందోళన వద్దు.. కోలుకుంటున్నానని స్వయంగా వెల్లడించిన స్టార్ హీరో సోషల్ మీడియాలో ఇటీవల ఒక…
రేచర్ల రాజుల కాలానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం పొందిన రాచకొండ మరోసారి వార్తల్లో…
చైనాలో సిమ్ కార్డుల నుంచి బంగారం – నెటిజన్ల ఆశ్చర్యం చైనాలోని క్యో అనే వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో…
ప్రపంచంలో అత్యంత చవక పెట్రోల్, భారత్ పరిస్థితి భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని సంవత్సరాల్లో భూకంపంలా పెరుగుతున్నాయి.…