“నేనే కాంప్రమైజ్ అవుతాను..” చైతూ గురించి అసలు విషయం చెప్పిన సమంత !

0
123

సమంత పెళ్లి కాక ముందు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంతా పెళ్లయిన తర్వాత తన స్పీడ్ కి బ్రేక్ పడుతుందని ఎంతో మంది భావించారు. కానీ పెళ్లి అయిన తరువాత సమంత రెట్టింపు వేగంతో దూసుకుపోతూ మరింత గుర్తింపును సంపాదించుకుంది. పెళ్లయిన తర్వాత గ్లామరస్ పాత్రలు కాకుండా ఎంతో అద్భుతంగా నటించే అవకాశాలను పొందుతున్నారు. కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెర పై బిగ్ బాస్, ఆ తరువాత ఆహా లో “సామ్ జామ్” వంటి ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా వ్యవహరించి తన సత్తా ఏంటో చూపించింది.

అంతేకాదు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సమంత అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతుంది. ఇక కొంచెం ఖాళీ సమయం దొరీకితె ఇంటిపైనే వ్యవసాయంపై దృష్టి పెడుతుంది. మరో వైపు ఫిట్ నేస్ కోసం జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేస్తుంది. ఇలా ప్రతీ విషయంలోనూ సమంత తనకు ఎవరూ సాటిలేరు అని నిరూపించుకుంటుంది. తాజాగా అభిమానులకు తన భర్త చైతన్య గురించి ఒక విషయం చెప్పుకొచ్చింది అక్కినేని వారి కోడలు.

తమ ఇద్దరి అప్పుడప్పుడు మధ్య గొడవలు జరుగుతాయని అసలు విషయం చెప్పుకొచ్చింది సమంత. అయితే తామిద్దరి మధ్య గొడవలు జరిగిన ప్రతిసారీ తానె కాంప్రమైజ్ అవుతానని చెప్పుకొచ్చింది. ఎందుకంటే తనకు సిగ్గులేదంటూ సరదాగా కామెంట్ చేస్తూ నవ్వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here