సమంత కోపం.. హీరో అడిగితే తప్పులేదు కానీ హీరోయిన్ అడిగితే తప్పేంటి..?

0
88

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాలీవుడ్ ని శాసించింది. కానీ ఇప్పుడు చేతిలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తానని చెప్పిన సమంత ని దర్శక నిర్మాతలు ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఫామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తప్పా వేరే ఏ ప్రాజెక్ట్ లేదు..ఈ దెబ్బతో ఆమె కెరీర్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చిందని చెప్పాలి.. మళ్ళీ అవకాశాలు వస్తే చెప్పలేం కానీ ఇప్పటికైతే ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్ట్ లు ఏవీ లేవు.

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుందనే సంగతి తెలిసిందే. కథలో హీరోకి సమానంగా హీరోయిన్ రోల్ ఉన్నప్పటికీ.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం హీరో దరిదాపుల్లో కూడా హీరోయిన్ ఉండదు.తాజాగా సమంత కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో టాప్ రేసులో ఉన్న హీరోయిన్ కి కనీసం టాప్ 20లో కూడా లేని హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే తక్కువ ఇస్తారని చెప్పుకొచ్చింది. హీరోయిన్ గనుక రెమ్యునరేషన్ పెంచితే ఆమె ఆమె భారీగా డిమాండ్ చేస్తుందని.. అత్యాశకు పోతుందనే ముద్ర వేస్తారని.. అదే హీరో అడిగితే మాత్రం పెద్దగా అభ్యంతరం చెప్పరని తెలిపింది.

ఏ మాయ చేశావే చిత్రంతో అందరిని మాయ చేసిన సమంత ఆ సినిమా తర్వాత ఆమెకు ఏర్పడ్డ క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే.. ఆ సినిమా వచ్చి పది సంవత్సరాలు దాటుతున్నా సమంత కి ఉన్న క్రేజ్ అస్సలు తగ్గలేదు. దీనికి తోడు అక్కినేని కోడలై వారి ఫ్యాన్స్ అభిమానాన్ని కూడా చూరగొన్నది.చాల తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిన సమంత పెళ్లి కాకముందే పెద్ద స్టార్.. అయితే చాలామంది హీరోయిన్ లు పెళ్లి తర్వాత సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపారు. కానీ సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు, షో లు చేస్తూ అందరిని అలరిస్తుంది. ది ఫామిలీ మెన్ సిరీస్ తో ఆమె OTT రంగ ప్రవేశం చేస్తుంది. ఇందులో ఆమె నెగెటివ్ పాత్రలో నటిస్తోంది.త్వరలోనే స్ట్రీమ్ కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here