Sameera Reddy : బాలీవుడ్ లో మొదలుపెట్టి సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమీరా రెడ్డి. హిందీ లో ‘మైనే దిల్ తుజుకో దియా’ సినిమాతో పరిచయమైన ముద్దుగుమ్మ వరుసగా హిందీలో బిజీ హీరోయిన్ అయింది. ఆ తరువాత సౌత్ లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ తమిళ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి సరసన నటించిన సమీర పెద్దగా తెలుగు సినిమాల్లో నటించలేదు. ఇక తమిళం లో సూర్య తో నటించిన సమీర చివరగా ఒక కన్నడ సినిమాలో నటించింది. ఇక తెలుగులో చివరగా ‘కృష్ణం వందే జగత్ గురుం’ సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసిన ఈ బ్యూటీ ముంబై కి చెందిన అక్షయ్ వార్డె ని పెళ్లి చేసుకుని సినిమాలకు బైబై చెప్పేసింది.

నా బాడీ నాకు నచ్చుతుంది…
పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన సమీర సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సమీర కు 2014 లో వివాహమైంది. ఆ తరువాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక బాబు, ఒక పాప తో తన భర్తతో కలిసి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమీర బాడీ పాజిటివిటి గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంటారు. ఒక హీరోయిన్ అయ్యిండి తెల్లజుట్టు ఉన్న ఫోటోలను షేర్ చేసి, కేవలం ఏదైనా స్పెషల్ రోజు మాత్రమే జుట్టుకు రంగు వేసుకుంటా అంతే అంటూ షేర్ చేయడంతో ఆమె పై అనేక ట్రోల్ల్స్ వచ్చాయి. కానీ వాటిని సమీర ఏ మాత్రం పట్టించుకోలేదు. జుట్టుకు రంగు వేసుకున్నంత మాత్రాన తన వయసును దాచలేను కదా వయసుతో పాటు మనలో వచ్చే మార్పులను స్వికరించాలి అని తనను ట్రోల్ చేసిన వారికి సలహా ఇచ్చింది.

ఇక తాజాగా సమీర పోస్ట్ చేసిన పిక్స్ కూడా బాగా ట్రోల్ అయ్యాయి. అయితే వాటిని అలాగే వదిలేయకుండా సమీర వారికీ రిప్లై ఇచ్చింది. ట్రోల్ చేసిన వాడికి గట్టి జవాబు చెప్పింది.”నా బాడీ అంటే నాకు చాలా ఇష్టం. కెమెరా ముందు బాగానే కనిపిస్తున్నాను. అవతలి వాళ్ళ అంచనాలను అందుకోవాలనే ప్రయత్నంలో నా శరీరాన్ని నేను కష్టపెట్టుకోవాలి అనుకోవడం లేదు. ఇతరులు ఏం అనుకుంటారో అని అలోచించి టైం వేస్ట్ చాలా చేశాను. నాకు నేను చాలా కంఫర్ట్బల్ గా ఉన్నాను. శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి, ఇతరుల ఎక్స్పెక్టేషన్స్ గురించి ఆలోచించకండి” అంటూ పోస్ట్ పెట్టింది. ఇక దీనిపై చాలా మంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు.































