Sampoornesh Babu: హృదయ కాలేయం కొబ్బరిమట్ట వంటి చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సంపూర్ణేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఈయన పలు కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు.ఈ విధంగా తన నటనతో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా తన మంచి మనసుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కూడా సంపూర్ణేష్ బాబు ముందు వరుసలో ఉంటారు.

ఈ క్రమంలోనే ఇదివరకే ఎన్నోసార్లు ఆపదలో ఉన్న ఈయన తనకు చేతనైనంత ఆర్థిక సహాయాన్ని చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండు నెలల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన సంకొజి లావణ్య, రమేష్ దంపతులరెండు నెలల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న సంపూర్ణేష్ బాబు స్వయంగా రమేష్ దంపతులకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
పాతిక వేలు ఆర్థిక సహాయం…
ఈ క్రమంలోనే మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్ తో పాటు రమేష్ ఇంటికి చేరుకున్న సంపూర్ణేష్ బాబు 25 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ విధంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో నటుడు సంపూర్ణేష్ బాబు పై మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా లావణ్యరమేష్ దంపతులు కూడా నటుడు సంపూర్ణేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు సంపూర్ణేష్ బాబు మనస్తత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.





























