Samrat : అహనా పెళ్ళంటా, పంచాక్షరీ, దేనికైనా రెడీ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సామ్రాట్ బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ కు రాకముందే అతని మొదటి భార్య హర్షిత రెడ్డి తో మనస్పర్తలు ఉండేవి. ఇక బిగ్ బాస్ సమయంలో ఆమె కేసు వేయడంతో సామ్రాట్ బిగ్ బాస్ హౌస్ నుండి కోర్ట్ కి వెళ్లి వచ్చేవాడు. ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక మొదటి భార్య ఆమెతో వివాదలు, పోలీస్ కేసులు అన్ని సాగాయి. ఇక ఇతన్ని గే అంటూ కూడా మొదట్లో కొన్నివార్తలు వచ్చినా మొదటి భార్యతో విడాకుల అనంతరం సామ్రాట్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.

మొదటి సారి పాప ఫోటోను చూపిన సామ్రాట్…
ఇక కరోనా లాక్ డౌన్ సమయంలోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. కాకినాడ కు చెందిన అంజనా శ్రీలిఖిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక లైఫ్ సాఫిగా హ్యాపిగా ఉంటే మరో ట్రీట్ అభిమానులకు ఇచ్చాడు సామ్రాట్. జూన్ నెలాఖరులో తన భార్య బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసి గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక ఆగష్టు 15 న ఆడపిల్లకు జన్మనిచ్చింది సామ్రాట్ భార్య.

ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నా పాప ముఖాన్ని చూపించలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోల్లో పాపను చూపించాడు సామ్రాట్. ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటోలను అభిమానులతో పంచుకున్న సామ్రాట్ పాపనులు ముద్ధాడుతూ ఉన్న ఫోటోలు క్యూట్ గా ఉన్నాయి. ఇక ఈ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి.



























