• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

‘కార్మేని సెల్వం’ మూవీ రివ్యూ : బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం!

3 April 2026

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026
ADVERTISEMENT

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

2 July 2026

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

2 July 2026

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?.. పోలీసులపై మాధురి ఆరోపణలు.. అసలు ఏం జరిగింది?

30 June 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026

‘కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారు’.. ప్రభుత్వంపై అమర్‌నాథ్ ఫైర్

30 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Saturday, October 10, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Movie News

‘కార్మేని సెల్వం’ మూవీ రివ్యూ : బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం!

by telugudesk
3 April 2026
in Movie News, Reviews
0
0
SHARES
8
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. విలక్షణ నటులు సముద్రఖని, లక్ష్మీ ప్రియా జంటగా నటించిన ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది.

కథ విషయానికొస్తే :
ఇప్పటి సమాజంలో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఉందో, అది కుటుంబ బంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ చిత్రం చాలా సున్నితంగా చూపిస్తుంది. ఎక్కడా బోర్ అనిపించకుండా, భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది. సెల్వం అనే కార్ డ్రైవర్ పాత్రలో సముద్రఖని నటించారు. ఆయన భార్యగా లక్ష్మీప్రియా కనిపించారు. సంపత్, దేవి (గౌతమ్ మీనన్, అభినయ) దంపతుల దగ్గర సెల్వం కార్ డ్రైవర్‌‌గా పనిచేస్తుంటారు. ఆయన భార్య లక్ష్మీ ఇడ్లీ బండి నడుపుతూ.. కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉండాలనుకుంటుంది. సొంత ఇల్లు, కారు కొనుక్కోవాలనే కలతో వీరిపయనం సాగిస్తూ ఒక్కో రూపాయి సేవ్ చేసుకుంటుంటారు. ఓసారి సెల్వం చెల్లెలి కూతురి శుభకార్యానికి వెళ్లి అక్కడ అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన భర్తకు మాట రాకూడదనే తలపుంతో దాచుకున్న సొమ్ముతోపాటు మెడలోని తాళి బొట్టు కూడా అమ్మేసి వారికి సారె పెడుతుంది లక్ష్మీ. అది జరిగిన కొన్ని రోజులకే అనుకోకుండా సెల్వం కుమారుడి తలకు గాయం కావడంతో వైద్యానికి డబ్బులు అవసరమవుతాయి. దీనికోసం తప్పని పరిస్థితుల్లో సెల్వం బావ దగ్గర పదివేల రూపాయలు అప్పు చేస్తాడు. సంపత్ దంపతులు నెలరోజుల వెకేషన్‌కు ఫారిన్ వెళ్లడంతో తన కారును ట్యాక్సీగా మార్చి క్యాబ్ డ్రైవర్‌‌గా మారతాడు. ఈ క్రమంలో క్యాబ్‌ ఎక్కే ప్రతివారి నుంచి ఏదో ఒకటి తెలుసుకుని అలా ప్రయత్నం చేయాలనుకుంటాడు. ‘డబ్బు సంపాదించాలంటే డబ్బున్న వాడిలా ప్రవర్తించాలి..’ అని ఒకరు చెప్పడంతో ఫ్యామిలీతో ఓ స్టార్ హోటల్‌కు వెళ్లి అనవసర ఖర్చులు పెడతాడు. అలాగే ‘అప్పులు చేస్తేనే గొప్పోళ్లు అవుతారు’ అని మరొకరు చెప్పడంతో క్రెడిట్ కార్డు ద్వారా తన అవసరాలను తీర్చుకుంటూ, రాత్రింబవళ్లు క్యాబ్ నడిపి కష్టపడి కొంత డబ్బులు దాచుకుని, మరికొంత అప్పు చేసి మరీ ఊరి చివరన రెండు వందల గజాల స్థలం కొంటాడు. కానీ వాళ్ల భార్యకు మాత్రం అప్పు చేయడం ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఒకానొక సందర్భంలో అప్పులు బాధలు ఎక్కువై ఇంట్లో ఉన్నా లేడని చెప్పించుకునే పరిస్థితి నెలకొంటుంది. ఈ అప్పుల బాధలు తట్టుకోలేక దుబాయ్‌లోని షార్జాకు వెళ్లి కారు నడుపుతూ డబ్బు సంపాదించాలనుకుంటాడు. అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? భార్య, బిడ్డలను మిస్ అవుతూ ఎలా సఫర్ అయ్యాడనేది ఆసక్తికరంగా చూపించారు.

ఎలా ఉందంటే :
బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగే చక్కటి కుటుంబకథా చిత్రమిది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి వల్గారిటీ లేకుండా, మద్యపానం, ధూమపానంతో పాటు ఒక్క బూతుపదం కూడా లేకుండా ఇటీవల కాలంలో వచ్చిన సినిమా ఇది. మధ్యతరగతి కుటుంబ విలువలను చాటిచెప్పేలా సాగుతూ, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ వాళ్లను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందనేది చాలా రియలిస్టిక్‌గా చూపించిన విధానం ఆకట్టుకుంది. హృదయానికి హత్తుకునే ఈ చిత్రం.. డబ్బు, కుటుంబం, సంబంధాల మధ్య నడుస్తూ ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. ‘అనవసరం అయినవి కొంటే.. అవసరమైనని కోల్పోతాం’ అని క్లైమాక్స్‌లో వచ్చే డైలాగ్ సినిమా డెప్త్‌ను తెలియజేస్తుంది.

ఎవరెలా చేశారంటే :
సముద్రఖని తన సహజమైన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన పాత్రలో ఉన్న లోతు, భావోద్వేగాలు ఎంతో సహజంగా కనిపిస్తాయి. సెల్వం పాత్రలో సముద్రఖని నటించిన తీరు ప్రతి ఒక్కరినీ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. మధ్యతరగతి భర్తగా, మధ్యతరగతి తండ్రిగా తనదైన ఎమోషన్స్‌ను పండించారు. ఆయన భార్యగా లక్ష్మీ ప్రియా నటన ప్రతి మహిళకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గౌతమ్ మీనన్, అభినయ పాత్రల నిడివి తక్కువే అయినా కథపై బలమైన ప్రభావాన్ని చూపిస్తారు. మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఇది కూడా చదవండి :

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

దర్శకత్వం:
దర్శకుడు రామ్ చక్రి ఈ కథను చాలా సహజంగా, రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. ప్రతి సీన్‌లోనూ ఒక జీవం కనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు.

సాంకేతిక అంశాలు:
సినిమాటోగ్రాఫర్ యువరాజ్ దక్షణ్ అందించిన విజువల్స్ ప్లెజెంట్‌గా ఉన్నాయి. మ్యూజిక్ ఈ చిత్రానికి అదనపు బలం. రామానుజన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేస్తుంది.

హైలైట్స్:
సముద్రఖని అద్భుత నటన
బలమైన కథ, భావోద్వేగాలు
కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైన అంశాలు
రియలిస్టిక్ టేకింగ్
ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేని కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ మూవీ

ఫైనల్‌గా : “కార్మేని సెల్వం” ఒక సాధారణ కథను అసాధారణంగా చెప్పిన మంచి సినిమా. భావోద్వేగాలు, కుటుంబ విలువలను ఇష్టపడే వారికి తప్పకుండా నచ్చుతుంది.
రేటింగ్: ⭐⭐⭐ 3.25 / 5

ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

1 July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్

1 July 2026

‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..

1 July 2026

‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..

30 June 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

13 September 2026

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

7 July 2026

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

7 July 2026

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

2 July 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk