Samyuktha Hegde: నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వచ్చిన కిర్రాక్ పార్టీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది సంయుక్త హెగ్డే. కర్ణాటకకు చెందిన సంయుక్త కన్నడ లో ‘కాలేజ్ కుమార్’ సినిమాలో నటించింది. తాజాగా ఆహా ఓటీటీ లో విడుదల అయిన తమిళ్ సినిమా మన్మధ లీలై లో నటించింది. అయితే ఇపుడు ప్రస్తుతం క్రీం అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే ప్రస్తుతం సంయుక్త కి సంబందించిన ఒక వార్త అభిమానులను కలవర పెడుతోంది.

సరిగా ల్యాండ్ కాకపోవడంతో మోకాలి దగ్గర బలమైన గాయం…
యాక్షన్ సినిమా షూటింగ్ లు, గాయపడటం ఎక్కువగా హీరోల విషయంలో చూస్తుంటాం. డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం కారణంగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఈకోవలోకి అప్పుడప్పుడు హీరోయిన్లు కూడా చేరిపోతుంటారు. ఈ జాబితాలోకే వస్తుంది కన్నడ భామ సంయుక్త. ప్రస్తుతం కన్నడ సినిమా క్రీమ్ లో నటిస్తున్న సంయుక్త కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనగా షూటింగ్లో ప్రమాదావశాత్తు గాయపడింది.
షూటింగ్ సమయంలో సరిగా ల్యాండ్ కాకపోవడంతో మోకాలి దగ్గర బలమైన గాయమైందని సంయుక్తా హెగ్డే చెప్పారు. కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు ఆమె తెలియజేశారు. షూటింగ్ సమయంలో ఎలా గాయపడిందో ప్రేక్షకులకు చూపించడం కోసం సంయుక్తా హెగ్డే మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. తనకు షూటింగులో గాయమైనప్పటికీ, సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆ ఫైట్ చూశాక అందరూ మెచ్చుకుంటారని చెప్పారు.



























