బుల్లితెరపై యాంకర్ రష్మీ ఓ సెన్సేషన్ చేసిందని చెప్పొచ్చు.. అసలు ఆమె యాంకర్ గా రంగ ప్రవేశం చేయడం కూడా చిత్రం గా జరిగిందని చెప్పొచ్చు.. జబర్దస్త్ కి మొదటిగ అనసూయ యాంకర్ గా ఉండగా ఏవో కారణాలతో ఆమె షో నుంచి తప్పుకుంది. అనూహ్యంగా రష్మీ ఆమె ప్లేస్ లో ఎంట్రీ ఇచ్చి పాతుకుపోయింది.. ఆ తర్వాత రెండు షో లు పెట్టి దానికొకరు దీనికొకరు యాంకర్ గా ఉంటున్నారు.. నిజానికి బుల్లితెరపై ఇప్పుడు టాలెంటెడ్ యాంకర్ లకు కొదువలేదు. ఒకప్పుడు యాంకర్ ఒక్క సుమవైపే చూసేవారు.. కానీ ఇప్పుడు యాంకర్ ల అషన్స్ పెరిగిపోయాయి..
వాక్చాతుర్యంతో పాటు గ్లామర్ చూపించే యాంకర్స్ అందుబాటులో ఉండడంతో బుల్లితెర కలర్ఫుల్ గా కనపడుతుంది.. అనసూయ, రష్మీ, వర్షిణి ఇలా చాలామంది యాంకర్స్ లైం లైట్ లోకి వచ్చేసి బుల్లితెర అర్థాన్నే మార్చేస్తున్నారు. ఇక వెండితెరపై మెరిసి ఆ తర్వాత బుల్లితెరపై దూసుకుపోతున్న రష్మీ ప్రస్తుతం పలు షో లతో ఫుల్ బిజీ గా ఉన్నారు. తాజగా ఆమె చేసిన తొలి చిత్రం గురించి గుర్తు చేసుకున్నారు. ఈమె మొట్టమొదటిగా హీరోయిన్ గా చేసిన సినిమా…కందేన్ అనే తమిళ చిత్రం.
ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అయితే ఈ అవకాశాన్ని ఈమెకు హీరోయిన్ సంగీత ద్వారా దక్కింది. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ రష్మిక మాత్రం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. రష్మీ నటనకు మంచి గుర్తింపు దక్కుతోంది కానీ… ఈమెకు దశ తిరిగే రేంజ్ లో అవకాశాలు మాత్రం అందడం లేదు.ప్రస్తుతం రష్మి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్‌బస్టర్. హీరో నందుతో కలసి ఈ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది మరి ఈ సినిమా హిట్ అయ్యి ఆమెకు సినిమాల్లో మరిన్ని ఛాన్స్ లు దొరుకుతాయా చూడాలి.



























