Saniya ayyappan : సెలబ్రిటీలకు బయట పబ్లిక్ లోకి సినిమా ప్రచారలకోసమో లేక ఏదైనా మాల్స్ ఓపెనింగ్స్ కోసమో వస్తే జనం వారిని చూడడానికి ఎగబడటం, ఫోటోలు అంటూ హడావిడి మామూలే. ఇవి కొంత వరకు సెలబ్రిటీలకు బాగానే అనిపించినా మరీ శృతి మించితేనే ఇబ్బంది పడతారు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంత మంది గుంపులోవచ్చి తాకరానిచోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివాటికి బయపడి చాలా మంది ఫుల్ సెక్యూరిటీ తో పబ్లిక్ లోకి వస్తుంటారు. ఇక హీరోలకు ఇలాంటి పరిస్థితే వస్తే మన బాలయ్య అయితే చేతికి పని చెబుతాడు.

చెంప పగులగొట్టిన హీరోయిన్…
ఇక సమంత, మొన్నా మధ్య అనుపమ ఇలా చాలా మంది వర్ధమాన హీరోయిన్లు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు తాజాగా మళయాలి హీరోయిన్ సానియా అయ్యప్పన్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమె నటించిన చిత్రం ‘సాటర్ డే నైట్’ సినిమా ప్రమోషన్స్ కోసం ఒక మాల్ కి వెళ్ళింది చిత్ర బృందం. అక్కడ ఈవెంట్ అంతా బాగా జరిగింది, బాగా జనం కూడా హాజరయ్యారు. అంతా బాగానే జరిగాక చివర్లో హీరోయిన్ వెళ్లిపోయే సమయంలో హీరోయిన్ సానియా ను చూడటానికి జనం ఎగబడ్డారు.

బాడీ గార్డ్స్ ఉన్నా కూడా గుంపుగా జనం రావడం కొంతమంది మంది ఆకాతాయిలు సానియా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడానికి ప్రయత్నించడం తో ఓపిక నశించి బాలయ్య బాబు ట్రీట్మెంట్ ఇచ్చింది. సానియా వాళ్ళల్లో ఒకడి చెంప పగులగొట్టింది. ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు జనాన్ని అదుపు చేసి ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. మేము కేవలం సెల్ఫీ కోసం వెళితే హీరోయిన్ కొట్టడం మరీ టూ మచ్ అంటూ వాళ్ళు ఆరోపించారు. నెట్టింట్లో దీనికి సంబంధిచిన వీడియో వైరల్ అయింది.
































