Sarkaaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తిసురేష్ హీరోయిన్ గా పరుశురామ్ దర్శకత్వంలో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది సర్కారు వారి పాట సినిమా. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ కలెక్షన్లు మాత్రం బాగా రాబడుతోంది. ఇది పక్కన పెడితే ఈ సినిమా విషయంలో దర్శకుడు పరుశురామ్ మీద విమర్శలు వచ్చాయి. స్టార్ హీరోలని సరిగా హేండిల్ చేయడం రాలేదని మొదటిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.అయితే మరొక విషయంలో కూడా పరుశురాం విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కొన్ని లాజిక్ లేని సీన్ ల ను పెట్టారు అని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పరుశురాం వీటి మీద వివరణ ఇచ్చారు.
లాజిక్ లేని సీన్లు…..

సినిమా ప్రారంభంలోనే చిన్నతనంలో మహేష్ టాటూ వేయించుకునే సీన్ లో .. ఓ ముసలావిడ ఏ పచ్చబొట్టు కావాలి అని, కృష్ణది కావాలా.?, చిరంజీవిది కావాలా? అని అడుగుతుంది . దానికి సమాధానంగా చిరంజీవి పేరు చెప్తాడు మహేష్. ఈ సీన్ కి మెగాస్టార్ అభిమానులు థియేటర్ లో విజిల్స్‌తో సందడి చేస్తున్నారు. ఈ సీన్ ను లాజిక్ లేకుండా పెట్టారు అంటున్నారు. ఇకపోతే హీరోయిన్ మీద కాలు వేసుకొని పడుకొనే సీన్ మీద విమర్శలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చారు పరుశురామ్. చిన్నతనం లోనే వాళ్ళ అమ్మను కోల్పోయిన హీరో, హీరోయిన్ ని వాళ్ళ అమ్మలా చూస్తుంటాడు అని సినిమాల్లో వారిద్దరి బంధం లో వల్గారిటీ లేదని స్పష్టం చేశాడు. అలా ఉంటే మహేష్ అసలు ఆ సీన్ చేయరు అని క్లారిటీ ఇచ్చారు.
“లాలా… భీమ్లా”…. పాట రింగ్ టోన్…..

సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు పదే పదే సుబ్బరాజుకు కాల్ చేస్తుంటాడు. సుబ్బరాజు ఫోన్ రింగ్ అయిన ప్రతిసారి ‘లాలా.. భీమ్లా’ పాట రింగ్ టోన్ వినిపిస్తుంది. ఈ రింగ్ టోన్ సీన్ వచ్చిన ప్రతిసారి థియేటర్లలో పవర్ స్టార్ అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే ఈ సీన్ ఎందుకు పెట్టారు అనే దానిపై దర్శకుడు ఇలా క్లారిటీ ఇచ్చారు….వేరే రింగ్ టోన్ పెడితే ఆడియో క్లియర్ గా వినిపించడం లేదని..అందుకనే తాను తమన్ కలిసి భీమ్లా నాయక్ రింగ్ టోన్ కి డిసైడ్ అయ్యామన్నారు. అలా పవర్ స్టార్ పాటను వాడేసామని చెప్పారు.
































