Sarkaaru vaari pata big update : పరుశురాం దర్శకత్వంలో వస్తోన్న మహేష్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను అంతా ముగించుకుని సినిమా విడుదలకు సిద్ధమైంది. మే 12 న విడుదలకు సిద్ధం అయి ఏ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ బాగా ప్లాన్ చేస్తోంది. ఇక మొదట విడుదల చేసిన కళావతి పాట సంగీత మాధ్యమాలను ఒక ఊపు ఊపేసింది.

ఇక ఆ తరువాత విడుదల చేసిన పెన్నీ సాంగ్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇక ఈ పాటలో సూపర్ స్టార్ అభిమానులకు సితార డాన్స్ తో ట్రీట్ ఇచ్చింది చిత్ర బృందం. ఇక ఆ తరువాత మహేష్ బాబు మాస్ అభిమానులకు మాస్ పాటతో ట్రీట్ ఇచ్చాడు. ఇలా ప్రొమోషన్స్ ను చక్కగా ప్లాన్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచాడు. ఇక రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ అయితే అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది . పోకిరి సినిమా తరువాత మళ్ళీ మాస్ హీరోగా మహేష్ నటిస్తుండడంతో అంచనాలు బాగా పెరిగాయి.
ఇక పరుశురాం సినిమా ఇలా కూడా తీయగలడా అన్నట్లు ట్రైలర్ ఉంది. అటు క్లాస్ ఎటు మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు పరశురామ్. ఈ సినిమాతో ఖచ్చితంగా పరుశురామ్ బ్లాక్ బస్టర్ హాట్ అందుకుని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాడంటున్నారు అభిమానులు. ఇక ఇపుడు ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్ డేట్ బయటికి వచ్చి అభిమానులను ఊరిస్తోంది. సర్కారు వారి పాట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 7వ తేదీన, సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతుందని తెలిపింది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలలోని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆ ఈవెంట్ కు హాజరవటానికి సిద్ధమవుతున్నారు. అయితే, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఎవరు రాబోతున్నారన్న విషయం తెలియాల్సివుంది.



























