Sarpanch Navya : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య సాగుతున్న వివాదం మరోసారి మీడియా ముందుకు వచ్చింది. గతంలో తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె ఆరోపించారు. అపుడు ప్రజాసంఘాలు, మీడియా ఈ ఇష్యూని బాగా వైరల్ చేయడంతో కెసిఆర్ ప్రభత్వం. రాజయ్యను ఇష్యూని పరిష్కరించుకోవాలని చెప్పడంతో రాజయ్య ఒక మెట్టు దిగి నవ్య ఇంటికి వచ్చి అందరి సమక్షంలో క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో 25 లక్షల అభివృద్ధి పనులను గ్రామానికి ఇస్తానంటూ మీడియా ముందు హామీ ఇచ్చారు. గొడవ సద్ధుమణిగిందని అందరూ భావించినా మరోసారి ఆ ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్యే తన మొగుడిని ట్రాప్ చేశాడంటూ నవ్య తాజాగా ఆరోపిస్తున్నారు.

దమ్ముంటే నాకు ఫోన్ చేయి…
నవ్య ఎమ్మెల్యే ను దుర్భాషలాడుతూ అలాగే ఆయనకు సహకరిస్తున్న ఒక దొర మహిళా ఉద్యోగిని కూడా తిట్టారు. త్వరలోనే వాళ్ళ పేర్లు బయటపెడతానని మీడియాతో చెప్పారు. తన భర్త కి డబ్బు ఆశ చూపి ట్రాప్ చేసారని ఒక మహిళా ఉద్యోగి ద్వారా ఇదంతా చేసారని ఆరోపించారు. 25 లక్షల డబ్బు ఇస్తానని నా భర్తకు ఆశపెట్టి నా చేత సంతకం చేయించమని చెప్పారు.

బాండ్ పేపర్ మీద సంతకం చేయించుకుని నేను చేసిన ఆరోపణలు అపద్దమని డబ్బు కోసం చేసినట్లు ఆ బాండు పేపర్ మీద రాసుకున్నారు. ఆపైన ఇచ్చిన 20 లక్షలు అప్పుగా చూపించారు. గ్రామ అభివృద్ధికి డబ్బు ఇస్తానని చెప్పి ఇలా నా భర్త ద్వారా నన్ను మోసం చేయాలనుకున్నారు. ధైర్యం దమ్ము ఉంటే నాకు కాల్ చేయాలి. నా భర్తని అడ్డం పెట్టుకుని కుట్రలు చేయొద్దు. నా ఫోన్ నెంబర్ అంటూ నవ్య తన మొబైల్ నెంబర్ ని 9000150630 ఇచ్చారు. నా భర్తకు విడాకులైనా ఇస్తాను కానీ మోసానికి తల వంచను అంటూ నవ్య ఫైర్ అయ్యారు.

































