Sarpanch Navya : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ప్రవీణ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మీద మరోసారి ఆరోపణలను చేసారు నవ్య. గతంలో నవ్య తన మీద ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించగా మీడియా, ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు రాజయ్య గారు ఆమె ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పి నవ్య కుటుంబంతో మాట్లాడారు. అనంతరం సర్పంచ్ నవ్య, ఆమె భర్త ప్రవీణ్ తో కలిసి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఇపుడు తాజాగా మరోసారి నవ్య మీడియా ముందుకు వచ్చారు. 25 లక్షలు ఇస్తానని రాజయ్య మోసం చేసాడని తన భర్తను కూడా బుట్టలో వేసుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా సర్పంచ్ భర్త లైవ్ లో ఆధారాలను చూపించకుండా బుకాయించడం హాట్ టాపిక్ అయింది.

లైవ్ లో నవ్యకి చుక్కలు చూపించిన భర్త…
గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య జరుగుతున్న వివాదంలో తాజాగా నవ్య భర్త ప్రవీణ్ ఎమ్మెల్యే తో కలిసి నవ్య మీద కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే, అలాగే ఒక మహిళా అధికారి తన భర్తను ట్రాప్ చేసి సంతకం పెట్టించాలని అనుకున్నట్లు నవ్య ఆరోపించిన విషయం తెలిసిందే.

నవ్య తాజాగా ఆధారాలను మీడియా ముందు ప్రవేశపెట్టాలని భావిస్తే భర్త ఫోన్ లోని రికార్డింగ్స్ వినిపిస్తా అంటూనే బుకాయించి లైవ్ నుండి వెళ్ళిపోయాడు. ఎమ్మెల్యే మీద బెదిరింపులు అలాగే లైంగిక వేధింపుల కింద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన జానకీపురం సర్పంచ్ ఎమ్మెల్యే విషయంలో ఎవరు నా వెంట రాకపోయిన పోరాడుతానని తెలిపారు.


































