Sarpanch Navya husband Praveen : గత కొన్నిరోజులుగా బాగా వైరల్ అవుతున్న జానకీపురం సర్పంచ్ నవ్య స్టేషనఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ లో సర్పంచ్ నవ్య తన భర్త మీద కూడా తీవ్ర ఆరోపణను చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నవ్య భర్త ప్రవీణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎమ్మెల్యే మనుషులు తనని మోసం చేసారని వారికి సహాయం చేస్తున్నా అనుకున్నా కానీ నా కుటుంబాన్నే నాశనం చేయాలనుకుంటాడని ఉంహించలేదు అంటూ మాట్లాడారు.

అందుకే నా భార్య నాపై ఆరోపణలను చేసింది…
ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పడానికి ఇంటిక వచ్చినపుడు తక్షణమే 25 లక్షలు గ్రామం అభివృద్ధికి శాంక్షన్ చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఊర్లో అందరూ మేము ఎమ్మెల్యేతో డబ్బు తీసుకుని హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నామని అనుకునేలా చేసారు. మేము హైదరాబాద్ లో నెల రోజులు నా బావమరిదికి బాగోలేదని ఉంటే అక్కడ ఆస్తులు కొన్నట్లు వదంతులు పుట్టించారు. ఊర్లో మాకు పడని వాళ్ళతో ఇలాంటి పని చేయించాడు. ఒకటి రెండు సార్లు నా అకౌంట్ లోకి డబ్బు వేసి ఎమ్మెల్యే పిఏ తీసుకునేవాడు.

ఆ డబ్బు ఎమ్మెల్యే కి ఇచ్చేవాడో లేదో నాకు తెలియదు. వాళ్లకు అకౌంట్ లో డ్రా చేస్తే సమస్య అని నా అకౌంట్ లో వేసి డ్రా చేసి క్యాష్ తీసుకునేవారు. ఆ ట్రాన్సక్షన్స్ చూసి నా భార్య అపార్థం చేసుకుని మీడియా వాళ్ళను పిలిచి ఇదంతా జరిగిపోయింది. వాళ్లతో ఇంకెలాంటి సమస్య ఉండకూడదు అనే సంతకం చేయించుకు రమ్మంటే వచ్చాను. నా కుటుంబం భవిష్యత్తుకి సమస్య అవుతుందని అలోచించి ఉంటే ఖచ్చితంగా చేసుండేవాడిని కాదు. నేను ఆలోచించలేదు, వాళ్ళు అంత మోసం చేయాలని చూస్తున్నారని నాకు ఏమాత్రం తెలియలేదు అంటూ చెప్పారు. ఇక తన భార్య ఒంటిమీదకి బంగారం కొనమని కూడా ఏ రోజూ అడగలేదు కానీ నీతి మాలిన పని మాత్రం ఏప్పటికీ చేయలేము అంటూ చెప్పారు.


































