Sathya Prakash : ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యప్రకాష్ గారు. ఒడిశాలో పుట్టి పెరిగిన సత్య ప్రకాష్ గారు వెంకటేష్ హీరోగా వచ్చిన ‘పెళ్లి చేసుకుందాం’ సినిమాలో విలన్ గా నటించారు. ఆ సినిమా ద్వారా విలన్ గా బాగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు. కన్నడ, తెలుగు, తమిళం అంటూ అన్ని భాషల్లోనూ విలన్ గా నటించిన ఆయన తన జర్నీ గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక తన సినిమాల్లో రేప్ సీన్స్ ఎక్కువగా ఉండేవంటూ అసలు నచ్చేది కాదంటూ చెప్పారు.

సౌందర్య గారు చిరంజీవితో నన్ను రేప్ చేసిన దుర్మార్గుడు అంటూ…
చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ ను రేప్ చేసే విలన్ గా నటించాను. నాకు ఆ రేప్ సీన్ అంటే నచ్చేది కాదు. కాకపోతే అప్పుడు నాకు ఇష్టం లేదు చేయను అనేంత స్టేటస్ నాకు లేదు. ఇప్పుడు సినిమాల్లో రేప్ సీన్స్ తక్కువగా ఉంటున్నాయి చాలా మారిపోయింది సినిమా. ఇది మంచి పరిణామం అంటూ చెప్పారు. నాకు వ్యక్తిగతంగా ఎవరైనా అమ్మాయిని రేప్ చేశాడంటే వాడికి ప్రపంచంలోనే అత్యంత బాధను కలిగించే శిక్ష వేయాలి కానీ చంపకూడదు, అలాంటి శిక్ష వేయాలనిపిస్తుంది అంటూ ఆయన అభిప్రాయాలను తెలిపారు.

ఇక తనతో నటించిన హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్య ను రేప్ చేసే సీన్ ఇప్పటికీ జనాలకు గుర్తుండిపోయింది. అయితే మళ్ళీ చూడాలని ఉంది సినిమాలో నటించినపుడు చిరంజీవి గారితో సోలో ఫైట్ చేశాను ఆ టైములో సౌందర్య గారు నన్ను ఆ సినిమాలో రేప్ చేసిన దుర్మార్గుడు వీడే అంటూ సరదాగా పరిచయం చేసారు. సౌందర్య నాతో కన్నడ లో మాట్లాడేది. ఇక చిరంజీవి గారు ఆరోజే చెప్పారు పెద్ద ఆర్టిస్ట్ వి అవుతావు ఇలా బైక్ లో హెల్మెట్ లేకుండా తిరగకు అని కారు కొనుక్కోడానికి డబ్బు ఇప్పించారు. అలా చిరంజీవి గారు నాకు కారు గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ సత్య ప్రకాష్ గారు ఆయన సినిమా అనుభవాలను పంచుకున్నారు.































