Sathya Sree : జబర్దస్త్ నుండి ఎంతో మంది కమెడియన్స్ నేడు సినిమాల్లోను అవకాశాలతో బిజీ ఆర్టిస్టులు గా అయిపోయారు. అయితే జబర్దస్త్ లో మేల్ కమెడియన్స్ కి కొదవ లేదు కానీ ఇప్పుడిప్పుడే ఫిమేల్ కమెడియన్స్ వస్తున్నారు. ఇంతకుముందు ఫిమేల్ కమెడియన్స్ కి బదులుగా లేడీ గెటప్ లతో కానిచ్చేవారు. నిజానికి లేడీ గెటప్ లకు మంచి క్రేజ్ ఉండేది కూడా శాంతి స్వరూప్, వినోద్, పవన్, సాయి, హరి వంటి వారికి మంచి గుర్తింపు లేడీ గెటప్ వల్ల వచ్చింది. అలాంటి జబర్దస్త్ లో మొదటి సారి ఒక అమ్మాయి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ట్రెండ్ సెట్ చేసింది.

కెరీర్ మొదట్లో అవమానాలు… క్యాస్టింగ్ కౌచ్…
జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా చమ్మక్ చంద్ర స్కిట్లలో కామెడీ టైమింగ్ తో గుర్తింపు తెచ్చుకున్న సత్య శ్రీ తన కెరీర్ మొదట్లో పడ్డ అవమానాలను చెప్పింది. అవకాశాల కోసం వెళ్ళినపుడు నీ మొఖానికి అసలు యాక్టింగ్ వస్తుందా, అంటూ అవమానించారని కానీ ఆ అవమానాలను పాజిటివ్ గా తీసుకుని కష్టపడ్డానని చెప్పింది సత్య.

అయితే అందరిలాగా క్యాస్టింగ్ కౌచ్ సందర్భాలు నాకు లేవని మా అమ్మ సినిమాల్లో నటించడం, మా అమ్మమ్మ రాజకీయాల్లో ఉండడం వల్ల అలాంటి పరిస్థితులు ఎదురవలేదు అంటూ చెప్పింది సత్య శ్రీ. తన తల్లీ పెద్ద రాయుడు సినిమాల్లో బ్రహ్మానందం భార్య గా నటించింది కూడా అంటూ చెప్పింది సత్య. ఇక జబర్దస్త్ లో ఎక్కడా ఇబ్బంది పడలేదని చాలా బాగా అందరూ చూసుకున్నారని మళ్ళీ జబర్దస్త్ లో పిలిస్తే ఖచ్చితంగా వెళ్తానని నన్ను జబర్దస్త్ సత్య శ్రీ అని పిలిస్తేనే ఇష్టపడుతానని చెప్పింది సత్య.































