Savithri daughter Chamundeswari : అలనాటి తార సావిత్రి గారు హీరోలకు ధీటుగా ఎదిగిన స్టార్. సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే అగ్ర హీరోయిన్ గా ఎదిగి ఇప్పటికీ ఎంతోమందికి నటనలో బెంచ్ మార్క్ సెట్ చేసిన మహానటి. ఆమె వెండి తెర మీద ఒక వెలుగు వెలిగినా నిజజీవితంలో మాత్రం ఓడిపోయింది. భర్త వల్ల, నమ్మిన వారు మోసం చేయడం వల్ల ఆర్థికంగానూ చితికిపోయి అలానే మానసికంగానూ క్రుంగిపోయి మరణించారు. ఆమె జీవితకథను ‘మహానటి’ గా సినిమా తీసి అలాంటి ఆ మహనటి గురించి ఈ తరం వారికి తెలియజేసారు. ఇక సావిత్రి గారి కూతురు విజయ చముండేశ్వరి గారు ఆమె భర్త గోవిందరావు గారు సావిత్రి గారి జ్ఞాపకాలను తన ఇంట్లో భద్రపరుచుకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు.

అమ్మను మోసం చేసిన వ్యక్తి ఎవరంటే…
సావిత్రి గారి అమ్మాయి విజయ చాముండేశ్వరి ఆమె భర్త గోవిందరావు గారు సావిత్రి గారి జీవితం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మాట్లాడారు. సావిత్రి గారు ఎంతో ఇష్టంగా చెన్నై లో 1962 లోనే కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ళు కట్టించుకున్నారంటూ తెలిపారు. ఇక అక్కడ స్విమ్మింగ్ పూల్ చాలా కొత్తగా అప్పటి వరకు ఎవరూ కట్టించని విధంగా కట్టించారు అంటూ తెలిపారు. ఇక మహానటి సినిమాలో సావిత్రి గారిని మోసం చేసిన సత్యం పాత్ర నిజ జీవితంలో ఎవరు అనే విషయాన్ని మాట్లాడుతూ చాముండేశ్వరి గారు ఆసక్తికర విషయాలను తెలిపారు.

సత్యం అనే పాత్ర సినిమాలో క్రియేట్ చేసిందే కానీ నిజ జీవితంలో సత్య అనే వ్యక్తి లేరని, ఒక చాకలి అతను ఉండేవాడు కానీ అతను చాలా మంచివాడంటూ చెప్పారు. ఒకే వ్యక్తిగత అమ్మను మోసం చేయలేదు. నలుగురైదుగురు కలిసి అమ్మాను మోసం చేసారు. సినిమాలో వాళ్లందరినీ కలిపి ఒక పాత్రగా సత్యం అని చూపించారు. పని వాళ్లలో కొంతమంది మేనేజర్ పేరుతో కొంతమంది మోసం చేసారు అంటూ చాముండేశ్వరి తెలిపారు. సావిత్రి గారి వద్ద పనిచేసిన పనివాళ్లు కూడా ఇప్పుడు చెన్నై లో కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంటూ తెలిపారు. అయితే పనివాళ్లలో కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు అలానే అమ్మని మోసం చేసిన వాళ్ళు ఉన్నారు అంటూ చాముండేశ్వరి తెలిపారు.
































