దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఏటీఎం కార్డ్ లేకుండానే నగదు విత్ డ్రా చేసే అవకాశాన్ని కల్పించింది. సరికొత్త ఫీచర్ ద్వారా ఎస్బీఐ కస్టమర్లు సులభంగా నగదు విత్ డ్రా చేయవచ్చు. అయితే ఎస్బీఐలో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విధంగా నగదు విత్ డ్రా చేయడం సాధ్యం కాదు. యోనో యాప్ ద్వారా నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉన్నవారు మాత్రమే ఈ విధంగా నగదు విత్ డ్రా చేయవచ్చు.

ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రిజిష్టర్ అయిన వారు ఆ వివరాల ద్వాఅరా ఎస్బీఐ యోనో యాప్ లోకి లాగ్ ఇన్ కావచ్చు. యోనో యాప్ లోకి లాగిన్ అయిన తరువాత యోనో క్యాష్ పై క్లిక్ చేసి విత్ డ్రా చేయాలనుకున్న అమౌంట్ ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత ఎస్బీఐ అకౌంట్ కు లింక్ అయిన రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ కు యోనో క్యాష్ ట్రాన్సాక్షన్ నంబర్ వస్తుంది. ఆ వివరాలను యోనో క్యాష్ పాయింట్లలో వినియోగించి నగదు విత్ డ్రా చేయవచ్చు.

మారుతున్న కాలానికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ఉండటం గమనార్హం. క్యాష్ ట్రాన్సాక్షన్ నంబర్ మెసేజ్ మొబైల్ ఫోన్ కు వచ్చిన సమయం నుంచి కేవలం 4 నాలుగు గంటలు మాత్రమే పని చేస్తుందని ఆ తర్వాత పని చేయదని తెలుస్తోంది. ఈ విధంగా కాకుండా మరో విధంగా కూడా నగదు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

ఎస్బీఐ ఏటీఎంల నుంచి ఏటీఎం లేకుండా క్యాష్ విత్ డ్రా చేసుకోవాలని భావించే వాళ్లు కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత యోనో క్యాష్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకొని సులభంగా క్యాష్ విత్ డ్రా చేసోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here