SBI: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ఈ నిబంధనల ద్వారా వినియోగదారుల నుంచి అత్యధిక చార్జీలు వసూలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS)ద్వారా ప్రస్తుతం రెండు లక్షల వరకు మాత్రమే ట్రాన్సక్షన్ చేసే అవకాశం కల్పించిన SBI ఇకపై ఈ ట్రాన్సాక్షన్ లిమిటెడ్ ఏకంగా ఐదు లక్షలకు పెంచేశారు. అయితే ఈ లావాదేవీలకు ఎలాంటి చార్జెస్ ఉండవు అని ప్రకటించారు.

కానీ ఎప్పుడైతే ఆఫ్‌లైన్ పద్ధతిలో ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ చేస్తే తప్పనిసరిగా వినియోగదారులు అధికంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆఫ్ లైన్ పద్ధతిలో ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే రూ.20+ అదనంగా జీఎస్టీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.
SBI ఆర్‌టీజీఎస్ చార్జీల వివరాలు..
ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఆర్‌టీజీఎస్ లావాదేవీలు జరిపితే వినియోగదారులు ఏ విధమైనటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు. కానీ ఆఫ్‌లైన్ పద్ధతిలో RTGS ద్వారా లావాదేవీలు జరిపితే ఛార్జీలు రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల వరకు రూ.20 సర్వీస్ ఛార్జీ + GST, అంతకన్నా ఎక్కువ అయితే రూ.40 సర్వీస్ ఛార్జీ + GST చెల్లించాలి. ఈ నిబంధనలు అన్ని వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.




























