మహేష్ బాబు వ్యానిటీ వ్యాన్ ఓ రేంజ్ లో ఉంది చూడండి..!

0
134

టాలీవుడ్ హీరోలు ఎం చేసినా ఈమధ్య దేశం మొత్తం ట్రెండ్ అయిపోతుంది.. వారు వేసుకునే చెప్పుల దగ్గరినుంచి తిరిగే కారు వరకు అన్నీ గొప్పగా చెప్పుకుంటున్నారు వారి వారి అభిమానులు.. మా హీరో ఈ బ్రాండ్ వేసుకున్నాడు అంటే ఈ టాప్ బ్రాండ్ వేసుకున్నాడు అని అభిమానులు సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తున్నారు.. ఈనేపథ్యంలో మహేష్ బాబు ఈమధ్యనే కొన్న వ్యానిటి వ్యాన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చర్చలు జరుగుతున్నాయి.

మహేష్ బాబు వేసుకునే  డ్రెస్ విషయం నుంచి కాళ్లకు వేసుకునే షూస్.. చేతికి పెట్టుకునే వాచ్ అన్నింటి గురించి ఫ్యాన్స్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు.. స్వాంకీ వ్యానిటీ వ్యాన్‌కు ఓనర్ అయ్యాడు. ఇప్పటి వరకు మహేష్ బాబు.. నిర్మాతలు ఏర్పాటు చేసే వ్యానిటీ వ్యాన్‌ను ఉపయోగించేవారు. కానీ రీసెంట్‌గా తన అభిరుచికి తగ్గట్టు ఓ వ్యానిటీ వ్యాన్‌ను రెడీ చేయించుకున్నాడు. అందులో అన్ని రకాలు సదుపాయాలున్నాయి.

ఇక మహేష్ బాబు సినిమా విషయాలకొస్తే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్. షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ మహేశ్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  సరిలేరు నీకెవ్వరూ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న మహేష్ ఈ సినిమా ను కూడా అదే విధంగా హిట్ చేయాలనీ ప్రయత్నిస్తున్నారు.. సరిలేరు నీకెవ్వరూ సినిమా తో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here