Senior actor Ashok Kumar : రంజిత నా కూతురే… నిత్యానంద, రంజిత మధ్య రిలేషన్ ఇదే… ఇద్దరు కూతుర్లు డివోర్స్ ఇచ్చి… భరించలేక భార్య చనిపోయింది…: సీనియర్ నటుడు అశోక్ కుమార్

0
265

Senior actor Ashok Kumar : విజయవాడ కి చెందిన అశోక్ కుమార్ గారు మొదట పోలీస్ ఉద్యోగిగా పనిచేస్తూ అందులో మానేసి హోటల్ మేనేజర్ గా పనిచేసి అక్కడా మానేసి చెన్నై వెళ్లి సినిమాల్లో ప్రయత్నించగా అక్కడ మొదట్లో చిన్న చిన్న పాత్రలు వేసి తరువాత హీరోగా పెద్దగా అవకాశాలు రాకపోయినా సహాయక పాత్రలతో ఎన్టీఆర్, నాగేశ్వరావు వంటి హీరోల సినిమాల్లో నటించిన ఆయన తన ముప్పై ఏళ్ల సినిమా కెరీర్ లో కేవలం 30 సినిమాలను మాత్రమే చేసారు. ఆత్మాభిమానం ఎక్కువగా ఉండటం వల్ల కొందరిని పొగిడితే పని జరుగుతుందని తెలియక హీరోగా వచ్చిన అవకాశాలను వదులుకున్నారు. ఇక ఆయనకు ముగ్గురు కూతుర్లు కాగా వాళ్లలో రెండో అమ్మాయి రంజిత కూడా తమిళ, తెలుగు సినిమాలలో నటించిన ఆర్టిస్ట్.

ఇద్దరు కూతుర్లు క్షోభ పెట్టారు…

అశోక్ కుమార్ గారికి ముగ్గురు కూతుర్లు కాగా మొదటి కూతురు అమెరికా లో సెటిల్ అవ్వగానే రెండో కూతురు రంజిత్ సినిమాల్లో కొద్ది రోజులు నటించి ప్రేమించి ఆర్మీ ఆఫీసర్ ను పెళ్లి చేసుకుంది. మూడో అమ్మాయి బొంబాయి లో ఉంది అంటూ చెప్పారు. అయితే మొదటి అమ్మాయి వద్దకు రంజిత వెళ్లే సమయంలో నిత్యానంద మీటింగ్స్ కి వెళ్ళేది. అలా ఆ మాయలో పడిపోయింది. ఇక భర్తతో కలిసి రాజస్థాన్ లో ఉండే సమయంలో తను ప్రెగ్నెంట్ కానీ తన గర్భం పోవడం మళ్ళీ పిల్లలు కలగరు అని చెప్పడం వల్ల అంతవరకు దేవుడిని నమ్మని రంజిత దేవుడిని నమ్మింది, అలా నిత్యానంద ఆశ్రమానికి ఎక్కువగా వెళ్ళేది. వాడు చేసిన మాయకు భర్తకు డివోర్స్ ఇచ్చి అక్కడే ఉండిపోయింది. పెద్ధ కూతురు భర్తకి డివోర్స్ ఇచ్చి నిత్యానంద వద్దే ఉంది.

ఇలా ఇద్దరు కూతుర్లు వాడి మాయలో పడి జీవితాలు నాశనం చేసుకున్నారు. ఆ బాధతోనే నా భార్య అనారోగ్యంతో మరణించింది. నిత్యానంద ఆశ్రమానికి వెళ్లి నా కూతుర్లను వెనక్కి తీసుకురావాలని అనుకుంటే నిత్యానందని నీకు సిగ్గు లేదా అని తిట్టినా వాడే కావాలి, మోక్షం ఇక్కడ దొరుకుంతుంది మేము ఇక్కడ సంతోషంగా ఉన్నామని నా కూతుర్లే చెప్పేసరికి వచ్చేసాను అంటూ బాధపడుతూ చెప్పారు అశోక్ కుమార్ గారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న వాళ్ళు మాతో మాట్లాడరు. ఎపుడైనా వాళ్ళ చెల్లికి మెసేజ్ చేస్తారు బాగున్నాం అని చెప్తుంటారు. వారికి డబ్బు మీద ఆస్తుల మీద లేదు అంటూ చెప్పారు.