Senior Actor Bhanu Chandhar : యాక్షన్ సినిమాలతో అలరించిన అలనాటి నటుడు భాను చందర్. కరాటే బ్లాక్ బెల్ట్ అయిన భాను చందర్ ఎక్కువగా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్నారు. ఆయన తల్లిదండ్రులు తెలుగువారైనా ఆయన పెరిగింది మద్రాస్. సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కొడుకుగా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన భాను చందర్ రజనీకాంత్ కి జూనియర్, అలానే చిరంజీవి వంటి సూపర్ స్టార్లు ఆయన సమకాలిన నటులు. ఆయన హీరో అవ్వడానికి ఇన్స్పిరేషన్ రజనీకాంత్ ఆంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో భానుచందర్ తెలిపారు.

కండక్టర్ హీరో అయినపుడు…
భాను చందర్ గారి తండ్రి మాస్టర్ వేణు గారు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఆయన తన కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అనుకోలేదు. తెర వెనుక కాదు తెర ముందు నువ్బు కనిపించాలని భాను చందర్ గారికి చెప్పేవారట. అలా అబ్బాయి బాగున్నాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేస్తే మంచి నటుడు అవుతాడు అని తెలిసిన వాళ్ళు సలహాలు ఇవ్వడంతో ఆడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసారు.

అక్కడ ఆల్రెడీ రజనీకాంత్ ఉన్న బ్యాచ్ సీనియర్స్, ఇక భానుచంధర్ తరువాత బ్యాచ్ లో చిరంజీవి జాయిన్ అయ్యారట. రజనీకాంత్ కు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నపుడు ఒక కండక్టర్ కష్టపడి హీరో అయినపుడు అన్నీ ఉండి నేనెందుకు హీరో అవ్వలేను అనే కసి నాలో పెరిగింది. రజనీకాంత్ నాకు నాలాంటి వాళ్లకు ఇన్స్పిరేషన్ హీరో అవ్వడానికి అంటూ భాను చందర్ తెలిపారు. ఇక చిరంజీవి నాకు మంచి మిత్రుడు అంటూ చెప్పారు.



























