Senior Actor Chandhra Mohan : హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా ఇలా ఎన్నో పాత్రలలో ఒదిగి పోయి ఆతరం నటులతోను ఇటు ఈ తరం నటులనతోను అందరితోనూ నటించిన వ్యక్తిగా చంద్ర మోహన్ నిలిచిపోయారు. ఇంకొంచం పొడవు ఉండి ఉంటే చంద్ర మోహన్ ఒక పెద్ద హీరో అయ్యేవాడు అంటూ నాగేశ్వరావు గారు స్వయన అనడం చంద్ర మోహన్ గారి నటనకు అవార్డు లాంటిది. అప్పట్లో అగ్రహీరోలకు సమానంగా సినిమాలను చేస్తూ హిట్లు కొట్టారు చంద్ర మోహన్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా ఆయన ఇటీవల యూట్యూబ్ లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని కెరీర్ కి సంబంధిచిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఉదయ్ కిరణ్ తో బాండింగ్…..
చంద్ర మోహన్ గారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణం రాజు, శోభన్ బాబు వంటి వారి దగ్గరి నుండి నేటి తారక్, చరణ్, ఉదయ్ కిరణ్, నాగచైతన్య వంటి నేటి తరం హీరోలతో నటించారు.ఇప్పటి హీరోలతో ఆయన నటనానుభావాలను చెబుతూ ముందు తరం వాళ్ళు సాధారణంగా ఉండేవారు డబ్బు పొదుపు చేసుకుంటూ ఉంటే ఇప్పటి తరం వారు అటు డబ్బు సంపాదిస్తూనే ఇటు లగ్జరీ గా ఉండాలంటున్నారు.

కానీ ఇది ఏమైనా ఒక పాత్రలో ఒదిగిపోయేలా నటించాలని ఇప్పటివారికి సలహాలు ఇస్తాను. ఇక నేను నటించిన ఇప్పటి హీరోల్లో ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే తో పాటు మరీ కొన్ని సినిమాల్లో కలిసి నటించాము. చాలా బాగా మాట్లాడేవాడు మా మధ్య మంచి బాండింగ్ ఉండేది అంటూ చంద్ర మోహన్ గారు వివరించారు.



































