Senior Actor Chandhra Mohan : మల్లంపల్లి చంద్ర శేఖర్ రావు అంటే ఎవరికీ తెలియదు కానీ చంద్ర మోహన్ అంటే మాత్రం అందరికి తెలుసు. హీరోగా, సహా నటుడుగా, కమెడియన్ గా ఎలా ఎన్నో పాత్రలు చేసిన చంద్ర మోహన్ గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంత కాలంగా పెద్దగా కనిపించక పోయిన ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన సినిమా విశేషాలతో పాటు ఆయన కెరీర్ లో ఉన్న మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఉదయం కలుద్ధామని వెళితే…
సమాకాలిన నటులందరితోను మంచి స్నేహ సంబంధాలు ఉన్న చంద్ర మోహన్ గారు , ఇక శోభన్ బాబు గారితో ఎక్కువ స్నేహం ఉండేదంటూ చెప్పారు. వాళ్లిద్దరు ఏరా అని పిలుచుకునే వారట. చెన్నై నుండి తెలుగు ఇండస్ట్రీ తరలి వెళ్ళిపోయాక వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడే ఉండటం వల్ల ఆ స్నేహితులు మరింత బలపడింది. ఇక శోభన్ బాబు మరణించిన రోజు చాలా బాధపడ్డాంటూ ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుని చంద్ర మోహన్ గారు ఎమోషనల్ అయ్యారు.

మరణించడానికి ఒక రోజు ముందు ఫోన్ చేసి రేపు ఉదయం 11 గంటలకు కలవాలి నిన్ను అని చెబితే ఆ సమయానికి వెళ్తే ఇల్లు నిర్మానుష్యంగా ఉంది ఏమయిందని ఇంట్లోవాళ్ళను అడిగితే ఉన్నట్లుండి మెట్లమీద నుండి పడిపోయారని చెప్పారు. అంబులెన్సు లో హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పగానే షాక్ అయ్యను. అయితే తెరుకునే లోపే శవాన్ని ఇంటికి తీసుకువచ్చేసారు. ఇంటి నుండి తీసుకు వెళ్ళేటప్పుడే ఆయన మరణించాడని చెప్పారు. రోజు మాట్లాడుకునేవాళ్ళం సరదాగా కబుర్లు చెప్పుకున్న వన్నీ గుర్తొచ్చి చాలా బాధపడ్డాను అంటూ ఎమోషనల్ అయ్యారు.
































