తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి.. ఇప్పుడు అన్ని పార్టీల వారు తమ తమ ప్రచారాలను మొదలుపెట్టారు.. ఇప్పటికే ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు..ఈ నేపథ్యంలో డీఎంకే పార్టీ యువ నేత ఉదయనిధి స్టాలిన్‌పై ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి నిప్పులు చెరిగారు.. ఇందులో భాగంగా హీరోయిన్ నయనతారకు, ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య రిలేషన్ ఉందని ఆయన కామెంట్ చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే తాను కామెంట్ చేసినట్టు ఆరోపణలు రావడంపై రాధారవి స్పందిస్తూ…

నయనతార, ఉదయనిధి మధ్య రిలేషన్‌షిప్ ఉంటే నాకేం సంబంధం. ఆ విషయంపై నాకు పట్టింపే లేదు అంటూ కామెంట్ చేశారు. నన్ను పార్టీ నుంచి బహిష్కరించానికి నయనతార ఎవరు.. వాళ్లెవరు అంటూ ఘాటుగా స్పందించారు. అయితే త్వరలోనే ప్రస్తుతం ఉన్న పార్టీ నుంచి బయటకు వెళ్లి మరో పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాల మధ్య ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
తమిళనాడు అసెంబ్లీ ప్రచారంలో నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఫ్యాన్స్ గుర్రుమంటున్నారు. ఇలా మహిళలను కించపరిచే నేతను పార్టీ నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు..మరోవైపు రాధారవి చేసిన వ్యాఖ్యలపై ఓ నెటీజన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.. ఈ నేపథ్యంలో ఆ నెటీజన్ ఓ వీడియో ని పోస్ట్ చేస్తూ.. బీజేపీ స్టార్ కాంపెయినర్ ఇంకా గుణపాఠం నేర్చుకొన్నట్టు కనిపించడం లేదు. మరోసారి నయనతారపై అభ్యంతరమైన కామెంట్లు చేశారు. ఇలాంటి చవకబారు కామెంట్లు చేసే వారిని పార్టీ ఎలా భరిస్తుందనే విధంగా ఆ వీడియోలో నెటీజన్ పేర్కొన్నారు.. ప్రస్తుతం కొందరు నెటిజన్లు ఈ సీనియర్ నటుడు చేసిన ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..!!