Senior Actor Dubbing Janaki : తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన డబ్బింగ్ ఎక్కువగా చెప్పడం వల్ల ఆపేరునే ఇంటి పేరుగా మార్చుకుని డబ్బింగ్ జానకిగా ప్రసిద్ధికెక్కిన దాసరి జానకి గారిది ఈస్ట్ గోదావరి జిల్లా పెద్దాపురం. ఏడో తరగతి వరకు చదివిన జానకిగారు మిలిటరీలో పనిచేస్తున్న తన ఊరికే చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడం వల్ల పారిపోయి పెళ్లి చేసుకున్న డబ్బింగ్ జానకి గారు చెన్నై కి వెళ్లి అక్కడ సినిమా ఇండస్ట్రీకి వెళ్లారు. నిజానికి నాటకరంగంతో బాగా పరిచయం ఉండటం వల్ల సినిమాల్లోనూ ప్రయత్నించారు జానకి. భర్త మిలిటరీలో పనిచేస్తూ ఉండటం వల్ల ఇద్దరు కొడుకులు కూతురు బాధ్యత ఎక్కువగా తానే చూసుకున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులు అలానే పడిన అవమానాలను తెలిపారు.

ఆ సంఘటనతో నాన్ వెజ్ మానేసాను…
ఒకప్పుడు విపరీతంగా నాన్ వెజ్ తినేదాన్ని అంటూ జానకి గారు తెలుపుతూ ఒక కన్నడ సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన వల్ల మానేసాను అంటూ తెలిపారు. అనంత్ నాగ్ నటిస్తున్న సినిమాలో తల్లి పాత్రలో నటిస్తున్న సమయంలో భోజనం అప్పుడు చికెన్ అడిగితే కేవలం హీరో, హీరోయిన్, డైరెక్టర్ కి మాత్రమే పెట్టమని నిర్మాత చెప్పాడని మేనేజర్ చెప్పడం వల్ల చాలా బాధగా అనిపించిందని, ఆ తరువాత ఆ సినిమా హీరోయిన్ మహాలక్ష్మి మరుసటి రోజు చికెన్ తిందాం ఆంటీ అని చెప్పి మేనేజర్ తో చికెన్ పెట్టించింది. ఆ రోజు తిని ఇక ఆపై తినకూడదని నిర్ణయం తీసుకున్నాను. నాకు ఇష్టం ఉండటం వల్లే ఇబ్బందిపడ్డాను అదే అసలు నాన్ వెజ్ మానేస్తే ఏది ఉంటే అది తింటాను కదా అని భావించిమానేసాను అంటూ చెప్పారు.

అయితే ఒక తొమ్మిది నెలల తరువాత మళ్ళీ తిన్నాను అదే సమయంలో చిన్న కొడుకు జాబ్ చేయలేకపోతున్నాను, మానేస్తున్నాను అని చెప్పడంతో జనవరి ఒకటిన చర్చిలో ప్రార్థన చేసే సమయంలో నా కొడుకుకి జాబ్ వస్తే ఇక లైఫ్ లో నాన్ వెజ్ తినను మానేస్తానని మొక్కుకున్నాను. అప్పటి నుండి ఇప్పటిదాకా మళ్ళీ నాన్ వెజ్ తినలేదు. గుడ్డు, కేక్ వంటివి కూడా మానేసాను అంటూ జానకి తెలిపారు. అలా మొక్కుకున్నాక వారంకే కొడుకు కి ఉద్యోగం వచ్చి అలానే ఇప్పటికీ అదే ఉద్యోగంలో స్థిరపడ్డాడు అంటూ తెలిపారు.

































