అందుకే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాలేదు… సీనియర్ నటి సితార ఆవేదన..!!

0
293

ఎన్నో కుటుంబ కదా చిత్రాలతో మన అందరికి సుపరిచితురాలైన సీనియర్ నటి సితార. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మనల్ని అలరిస్తోంది. 1986 లో ఆమె సినీ కెరియర్ ప్రారంభమైంది. ఆ తరువాత తెలుగు, తమిళం తో పాటుగా దాదాపు దక్షిణాది భాషలు అన్నిటిలో ఆమె నటించారు. స్వతహాగా మలయాళీ అయిన సితార మొదట్లో ఆమెను తెలుగమ్మాయి అనుకునేవారు. దానికి తోడు ఆమె నటించిన నటించిన పాత్రలు అన్ని కుటుంబ కథా చిత్రాలే కావడంతో ప్రతి ఒక్కరు ఆమెను తమ కుటుంబ సభ్యురాలిగా భావించారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి సితార.

అయితే అంత సీనియర్ నటి, దక్షిణాది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని విషయం చాలా మందికి తెలియదు. 50 ప్లస్ వయస్సు దాటినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై ఇదివరకు ఒక ఇంటర్వూలో ఆమె స్పందించారు. నటి సితారకు చిన్నప్పటి నుంచి ఆమె తండ్రి అంటే చాలా ఇష్టమట. తండ్రితో ప్రత్యేక అనుబంధం ఉండేదట. ఎప్పుడు నాన్న కూచిగానే ఉండడానికి ఇష్టపడేవారట సితార. తన సినిమాల్లో నటించే సమయంలో కూడా అన్ని విషయాలు తన తండ్రే దగ్గరుండి చూసుకునేవారు. అన్ని విషయాల్లో ఆమె తండ్రి మీద చాలా డిపెండ్ అయిపోయింది.

అయితే తన కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్న సమయంలో హఠాత్తుగా అయన మరణించారు. ఆ సమయంలో తనకు ప్రపంచమంతా శూన్యం అయిపోయింది, ఏమి చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ బాధలో చాలా రోజులు సినిమాల్లో కూడా నటించలేదు. ఆ బాధలోనే చాలా కాలం గడిచిపోయిందని, పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే తనకు రాలేదని చెప్పుకొచ్చింది. ఒకవేళ భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే తప్పకుండా మీడియాకు తెలియజేస్తానని తెలిపారు సితార.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here