గరికపాటి వరలక్ష్మి… ఈవిడ అ ఒకప్పటి డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ లలో మొదటి స్థానంలో ఉండే హీరోయిన్. జి.వరలక్ష్మి సెప్టెంబర్ 13, 1926 వ సంవత్సరంలో ఒంగోలు లో జన్మించింది. ఈవిడ కేవలం పదకొండేళ్ళ వయస్సులోనే తన ఇంటిని వదిలి వెళ్లి విజయవాడ చేరుకొని తుంగల చలపతి, దాసరి కోటిరత్నం మొదలగు రంగస్థల నటుల వద్ద నాటక బృందంలో నటించింది. ఈవిడ అ నాటకాలలో తన అద్భుత ప్రదర్శన చూపించి ఆ తర్వాత సినిమాల వైపు తన దృష్టి మలిచింది. అయితే తెలుగులో ఒక నవల ఆధారంగా సినిమాగా తీసిన బారిష్టర్ పార్వతీశం సినిమాతో జి. వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశారు.

ఇక అలా తర్వాత కొన్ని సినిమాల్లో తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఇట్లే ఆకట్టుకునేది. కేవలం తెలుగు సినిమాల్లోనే కాకుండా, తమిళ సినిమాల్లో కూడా నటించింది. అలా తన జీవితం కొనసాగిస్తుండగా… ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు కె. ఎస్. ప్రకాశ్ రావు ను వివాహం చేసుకున్నారు. ఆయనకు అప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు ఆయనే మన దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు. అయితే ఈవిడ కే ఎస్ ప్రకాశ్ రావుకు రెండవ భార్య. వీరికి ఒక కుమారుడు కె.ఎస్ సూర్యప్రకాష్. ఆయన కూడా తెలుగు సినిమా రంగంలో ఒక ఛాయాగ్రహకుడు. అలాగే వీరికి ఒక కుమార్తె కూడా ఉంది ఆమె పేరు కనకదుర్గ.

అయితే జి.వరలక్ష్మి తనకి ఒక కొడుకు, కూతురు ఉన్నా కానీ అప్పట్లో ఒక కుస్తీ పట్టే వ్యక్తి అజిత్ సింగ్ ను ఇష్టపడి అతనితో వెళ్ళిపోయింది. అయితే అతనితో వెళ్లిపోయిన కూడా కేవలం సంవత్సరం రోజుల తర్వాత వారి సంబంధం కూడా తెగిపోయింది. అయితే జి.వరలక్ష్మి అతనితో వెళ్లిపోవడంతో అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఒక పెద్ద హాట్ టాపిక్ గా ఆవిడ మారారు. అయితే ఆ కుస్తీ పట్టే వ్యక్తితో బంధం ముగిసిన కూడా ఆమెపై ఉన్న అభిమానంతో కొందరు దర్శకనిర్మాతలు ఆమెకు సినిమా ఆఫర్లను ఇవ్వసాగారు. అలా రెండు మూడు సినిమాలను చేసిన తర్వాత మళ్లీ తన జీవితం గాడిలో పడుతుంది అన్న సమయంలో తన కొడుకు చనిపోవడంతో మళ్లీ జీవితం సూన్యంలోకి పోయింది. ఇక తాను చేసిన తప్పులు ఎవరూ చేయకూడదని ఉద్దేశంతో తన జీవితాన్ని ఒక స్క్రిప్టు గా రాసి దానికి తప్పటడుగులు అని పేరు పెట్టారు. కానీ ఆ స్క్రిప్టుకు సినిమా చేయాలని భావించిన అది కుదరలేదు. అప్పట్లోనే మూగ జీవులు అనే సినిమాకి జి.వరలక్ష్మి దర్శకురాలిగా వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here