Senior Actor Jhansi : ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించిన అలనాటి నటి ఝాన్సీ. బాపు గారి సినిమాల్లో ఎక్కువగా కనిపించిన ఝాన్సీ గారు తల్లి పాత్రలతో ఎక్కువగా మెప్పించారు. ఎక్కువగా ఎన్టీఆర్ గారితోనూ, ఏఎన్ఆర్ తోనూ అప్పటి అగ్ర హీరోలందరితోనూ ఎన్నో సినీమాల్లో నటించిన ఆమె ఈ తరం వారికి గుర్తు రావాలంటే మాత్రం మనవూరి పాండవులు, పెళ్లి పుస్తకం, శంకరాభరణం వంటి సినిమాల్లో నటించిన ఝాన్సీ గారిని చూడాలి. ఎన్నో సినిమాల్లో నటించినా ఆర్థికంగా బాగా సంపాదించుకున్నా నేడు ఒక చిన్నగదిలో కాలం వెళ్ళదిస్తున్నారు ఝాన్సీ. అప్పట్లో అగ్ర నటులతో పనిచేసిన ఝాన్సీ గారు అప్పటి అనుభవాలను, తన ఆస్తులన్నీ పొవడానికి గల కారణాలను పంచుకున్నారు.

సుమన్ కి అంత రెమ్యూనరేషన్ ఇవ్వడం వల్ల లాస్ వచ్చింది…
సినిమా నిర్మాణంలో డబ్బులు పెట్టి అనవసరంగా పోగొట్టుకోకండి ఎంతో మందికి చెప్పే నేనే చివరకు సినిమాల్లో డబ్బు పెట్టి నష్టపోయాను అంటూ సీనియర్ నటి ఝాన్సీ గారు తెలిపారు. సుమన్ హీరోగా తీసిన ‘ఖైదీ ఇన్స్పెక్టర్’ సినిమాను బి.గోపాల్ డైరెక్షన్ లో తీయగా ఆ సినిమకు సుమన్ కు కోటి ఇరవై లక్షలు రెమ్యూనరేషన్ ఇచ్చామని, సినిమా మొత్తం బడ్జెట్ 2 కోట్ల 30 లక్షలు దాకా అయిందని చెప్పారు.

సుమన్ మార్కెట్ అప్పట్లో కోటిన్నర దాకా ఉండగా ఆ సినిమా వల్ల మాకు పెట్టిన డబ్బు తిరిగి రాలేదని చెప్పారు. అప్పటికే బి గోపాల్ గారి సినిమాలు రెండు ఫ్లాప్స్ అయ్యాయి. అయితే బి గోపాల్ వల్ల సుమన్ కాంబినేషన్ హిట్ అవుతుందనుకున్నాం. అయితే సినిమా వల్ల నష్టాలు మిగిలాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, తీసుకున్న రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వమని అడగలేము, ఆయన ఇవ్వరు అంటూ చెప్పారు.
































