Senior Actor Kavitha : నా భర్త చేసే వ్యాపారం… కోట్ల ఆస్తులు…కోట్ల ఆస్తులు ఉన్న ఇంటికి కోడలిగా….సినిమా చేస్తా అంటే…: సీనియర్ నటి కవిత

0
205

Senior Actor Kavitha : పదకొండేళ్ళకే సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్ గాను అలాగే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇటు రాజకీయాల్లోను ఉన్న కవిత గారు తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. కవిత గారు తమిళ ఇండస్ట్రీ లో మొదలు పెట్టి తెలుగులోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తరువాత హీరోయిన్ గా అడుగుపెట్టారు. చిరంజీవి, కృష్ణ ఎన్టీఆర్ ఇలా అందరి హీరోలతో చేసిన కవిత గారు కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసారు. ఇక తను నటించే సమయానికి ఇండస్ట్రీ వాతావరణం గురించి తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

కోట్ల ఆస్తులు ఉన్నాయి….

కవిత గారు హీరోయిన్ గా మంచి అవకాశలు అందుకుంటూ బిజీ అయ్యే సమయానికి చిన్న వయసులోనే పెళ్లి చేసేసుకున్నారు. అప్పటికే 500 కోట్ల ఆస్తులు ఉన్న సింగపూర్ కి చెందిన వ్యాపారవెత్తను కవిత గారు వివాహం చేసుకున్నారు. మొత్తం 14 మంది అన్నదమ్ములు అక్కచెల్లెలు ఉన్న పెద్దింటికి కోడలయ్యారు కవిత. పెళ్లయ్యాక కొన్నేళ్లు విధేశాలలో ఉన్న ఆమె తన భర్తకు ఆస్తులు ఉన్న పెద్దగా ఏమిటి అనిపించేది కాదని సింపుల్ గా బతకడం అంటే చాలా ఇష్టమని అందుకే విదేశాలలో ఎపుడు తిరుగుతూనే ఉన్న పెద్దగా అనిపించేది కాదని చెప్పారు.

పల్లెటూరు వాతావరణం ఎక్కడ దొరకదు అంటూ చెప్పారు. ఇక తన భర్త కి ఆయిల్ ఎక్సప్లరేషన్ వ్యాపారం ఉండేదని వివిధ దేశాలలో వ్యాపారాలు ఉండేవని తెలిపారు కవిత. అంత పెద్ధింటికి వెళ్లిన కవిత గారికి మొదట సినిమల్లో నటించరాదని తానే బ్రేక్ తీసుకున్నారట. ఆపైన సహాయక పాత్రలు వచ్చినపుడు హీరోయిన్ కాదు కాదా అని చెప్పి అత్తగారిని ఒప్పించి మళ్ళీ సినిమాల్లో నటించానని కవిత తెలిపారు.