Senior Actor Kavitha : చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు ఇలా అన్ని భాషలలోనూ హీరోయిన్ గా చేసిన కవిత గారు తెలుగులోనూ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ చాలా సినిమాల్లో నటించిన ఆమె అటు రాజకీయాల్లో ఉంటూనే నటి గా సీరియల్స్ లోనూ కనిపిస్తూ నటనను కంటిన్యూ చేస్తున్నారు. ఇక అప్పటి ఇండస్ట్రీ ముచ్చట్లు, గొడవల గురించి తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆ ఆర్టిస్ట్ పొట్ట మీద చేయి వేయడంతో బాగా తిట్టాను…
షూటింగ్ సమయంలో చిన్న చిన్న గొడవలు మామూలే అంటూ చెప్పిన కవిత గారు రీ ఎంట్రీ టైములో తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నపుడు ఒక ఆర్టిస్ట్ తన పొట్టమీద చేయి వేసి కవిత కి పొట్ట లేదు అని మిగతా వాళ్లకి చెప్పాడు. అలా నా పొట్ట మీద చాయి వేసి అనేసరికి నాకు బాగా కోపం వచ్చి అక్కడే తిట్టాను. మీ భార్యను కూడా వేరేవాళ్ళు చేయి వేసి మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది అని తిట్టేసరికి ఆ సినిమాలోని స్టార్ హీరో వచ్చి సర్ది చెప్పాడు. ఇక ఆషూటింగ్ లో అంతా ఆ ఆర్టిస్ట్ నావైపు ఎవరైనా వస్తుంటే జాగ్రత్తగా మాట్లాడండి ఆ కవిత కోపం ఎక్కువ అంటూ అనేవాడు అంటూ చెప్పారు.

ఇక ఇప్పటి హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు హీరోయిన్స్ గా ఉన్న శ్రీదేవి, జయప్రద, జయసుధ నేను అందరం కూడా అప్పట్లో జీరో సైజు లో ఉండేవాళ్ళము, ఏ డైట్ అవి పాటించలేదు. కొద్ది పాటి ఎక్స్ర్సైజులతో మెయిన్టైన్ చేసాము. ఇప్పుడు మితిమీరిన డైట్, వర్కౌట్స్ తో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. మీరందరూ అందగా ఉన్నారు ఇంకా సన్నబడి ఏదో చేయాలనుకుంటే ఎలా, ఆరోగ్యం ముఖ్యం కదా అది చూసుకోవాలి. హీరోయిన్స్ కే కాదు బయట యువతకు కూడా ఇది వర్తిస్తుంది అంటూ చెప్పారు.




























