Senior actor Murali Mohan home tour : సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కల. పేదవాడైనా, గొప్పవాడైనా ఇల్లు తమ అభిరుచికి తగ్గట్టు ఉన్నంతలో కట్టుకుంటారు. అయితే ఇల్లు కట్టడం అంత సులువేం కాదు మధ్య తరగతి వాళ్లకు. అందుకేగా పెద్దలు అంటారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని… అలాంటిది డబ్బు పేరు ఉన్న సెలబ్రిటీలు వారి అభిరుచికి తగ్గట్టు ఇంటిని నిర్మించుకుంటారు. ఈ మధ్యకాలం లో ప్రముఖులు వారి ఇళ్లను హోమ్ టూర్ అంటూ యూట్యూబ్ లోనూ సామజిక మధ్యమాల్లోను వీడియో తీసి పెట్టడం ట్రెండైంది.

ఇక అలాగే యూట్యూబ్ లోని సుమన్ టీవీ ఛానెల్ వారు.. సీనియర్ నటుడు, తెలుగుదేశం రాజకీయ నాయకులు మాగంటి మురళీ మోహన్ గారి ఇంటిని చూపించే కార్యక్రమం చేసారు. 15 క్రితం నిర్మించిన ఈ ఇంటిని మురళీ మోహన్ గారి అబ్బాయ్ జయభేరి అధినేత రామ్మోహన్ గారు చాలా శ్రద్దగా కట్టించారు. తాజ్ మహల్ తెల్లగా ఎలా మెరుస్తూ ఉంటుందో అలా ఉన్నా ఈ ఇంటి హోమ్ టూర్ లో ఎన్నో విషయాలు వివరాలను మురళీ మోహన్ గారి కోడలు రూప మాగంటి గారూ వివరించారు.
ప్రెంచ్ ఆర్కిటెక్ట్ ఆనంద్ దాన్ని డిజైన్ చేశారు. తాతోస్ అనే గ్రీస్ మార్బల్‌తో ఇంటిని నిర్మించారు. తాజ్‌మహాల్ ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఇళ్లు ఉంటుంది. మొత్తం రెండు ఫ్లోర్ల భవనం అది. ఇళ్లు కట్టి 15 సంవత్సరాలు అవుతున్నా.. నిన్న కట్టిన దానిలా మెరుస్తూ హుందాగా ఉంటుంది. ఇక ఛానెల్ వాళ్లకు మొదటి ఫ్లోర్ వరకే అనుమతినిచ్చారు చూపడానికి. ఇక మురళీ మోహన్ గారి కోడలు రూప వివరిస్తూ ఇల్లు అందరికి వ్యక్తిగతమైనదని అందుకే 15 ఏళ్లలో ఎంతో మంది ఇంటీరియర్ వాళ్ళు మీడియా వాళ్ళు అడిగిన చూపించలేదని మొదటి సరి ఎలా చూపిస్తున్నామని చెప్పారు. ఇక ఇంటి విశాలమైన లాన్ గురించి వివరించి తన మామగారు చాలా క్రమశిక్షణ గల వారని కానీ అత్తగారు చాలా స్ట్రాంగ్ విమెన్ అంటూ వివరించారు. కరోనా సమయంలో ఎక్కువగా ఈ లాన్ లోనే గడిపామని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.



























