Senior Actor Narasimharaju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. ఇక సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. ‘నీడలేని ఆడది’ వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.

రాజనాల గారు అహానికి పోయి అలా గొడవ చేసారు…
చెన్నై లో ఉన్నపుడు తమిళ ఇండస్ట్రీలో సీరియల్స్, సినిమాల వల్ల బాగా పేరు ఉండేదాంటూ నరసింహారాజు గారు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీ కంటే తమిళ ఇండస్ట్రీలో గుర్తింపు బాగుంటుందని అక్కడి ప్రజలు ఎక్కడి నుండి వచ్చామని చూడరంటూ, ప్రతిభ ఉంటే గుర్తిస్తారంటు చెప్పారు. అయితే తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న సమయంలో తెలుగులో నేనెవరో కూడా తెలియదు అంటూ చెపపరు. ఇక సినిమాల్లో అవకాశాలు 1985 నుండి తగ్గడం మొదలయింది, ఇక హైదరాబాద్ వచ్చాక పెద్దగా అవకాశాలు లేవు. నేను వచ్చిన అవకాశాలను చేసే వాడిని కానీ కొందరు సీనియర్ నటులు ఇబ్బంది పడ్డారు. అలాంటి వారిలో రాజనాల గారు కూడా ఉన్నారు. చిరంజీవి గారి సినిమా ‘మగధీరుడు’ లో నటించినపుడు ఆయన గొడవ చేశారు. రాజనాల గారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని చిరంజీవి గారు మగధీరుడు సినిమాలో అవకాశం ఇప్పించారు.

షూటింగ్ అప్పుడు చిరంజీవి గారు ఇంకా షాట్ కి రాలేదు, ఆలస్యమవుతోందని రాజనాల గారి మీద సీన్ తీసేద్దామని చిత్ర బృందం డిసైడ్ అయింది. ఆయన మీద చిత్రికరించే సీన్ దాదాపు ఒకటిన్నర గంట సేపు ఉంటుంది. అంతా రెడీ చేసుకుంటున్న సమయంలో చిరంజీవి గారు రావడంతో ఆయన మీద సీన్ చేయాలని డిసైడ్ చేశారు. దాంతో రాజనాల గారు కోపంతో ఊగిపోయారు. బాంచత్ నన్ను అవమానిస్తారా అంటూ గొడవ పెట్టుకున్నారు. అలా చేయడం వల్ల ఆయనకు అవకాశం పోతుంది, అక్కర్లేని అహం వల్ల ఆయన ఆర్థిక పరిస్థితి బాగుపడదు కదా అంటూ అభిప్రాయపడ్డారు.































